ధర్మన్నా…నీపోటీ ఎక్కడన్నా…?

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధన రెడ్డి

#పోటీలో టిటిడి జెఇఓ ధర్మారెడ్డి

#పర్వేలలో ఏ నియోజకవర్గం వస్తుందోనన్న చర్చ

#హాట్ టాపిక్ గా నియోజకవర్గాలలో ధర్మారెడ్డిపోటీ

 తిరుపతి తిరుమల దేవస్థానం జెఇఓ ధర్మారెడ్డి పై వైసిపి ఎన్నికల నీడ కొనసాగుతునే ఉంది.కుమారుడు మృతి చెందక ముందు నంద్యాల  వైసిపి ఎంపి అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం సాగింది. ఆమేరకు ధర్మారెడ్డిని ఓటర్లు ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై సర్వేలుకూడా చేయించారు..ఆ తరువాత ధర్మారెడ్డి కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతోఆయన తీవ్ర మనస్థాపానికి గురై కొన్నినెలలు కోలుకోలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో ధర్మారెడ్డి ఉమ్మడి జిల్లాలలోని 12 జనరల్ సీట్లలో ఏ సీటు నుంచి పోటీచేస్తే గెలుస్తారనే విషయంపై వైయస్ ఆర్ సి పితోపాటు మరికొన్ని స్వచ్చంద సంస్థలతో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.ఇప్పుడుచేస్తున్న  మార్పులే  (పాత అభ్యర్థులతో) తలనొప్పిఉంటే ధర్మారెడ్డిని ఏ నియోజకవర్గంలో దించితే అక్కడ కొత్తగా తలనొప్పి  ఆరంభం అవుతంది…ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి ప్రధాన అనుచరుడు కావడంతో ఆయనకు టికెట్టు సమస్యలేదు కాని పోటీచేసే నియోజకవర్గమే సమస్య అవుతున్నదని ఒక వైయస్ ఆర్ సిపి నాయకుడు పేర్కొన్నారు..

ధర్మారెడ్డి స్వంత గ్రామం నందికొట్కూరు నియోజకవర్గంలోని పారుమంచాల. ఆనియోజకవర్గం ఎస్ సి రిజర్వు.దీంతో పొరుగు నియోజకవర్గాలు అయిన నంద్యాల, శ్రీశైలంలలో బాబాయి, అబ్బాయిలు బలమైన వైయస్ ఆర్సిపి నాయకులు..దీంతో ఇక్కడ అవకాశం దొరకడం కష్టమేనని అందువల్ల నంద్యాల ఎంపి స్థానంనుంచి పోటీచేయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది..ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంతోమంది నాయకులునంద్యాలఎంపిగాపోటీచేయాలనిజగన్మోహనరెడ్డికివిన్నవించుకుంటున్నారు..చివరికి పోచా బ్రహ్మానందరెడ్డే తిరుగులేని అభ్యర్థిగా సెలక్టు అవుతున్నట్లు సమాచారం.మొత్తంమీద ధర్మారెడ్డి పోటీచేసే నియోజకవర్గం ఏదై ఉంటుందని నంద్యాల,కర్నూలుజిల్లాలలోని 12 నియోజకవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *