జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
#నంద్యాల వేదికగా అఖిల,శిల్పా విమర్శల వర్షం
#హాట్ హాట్
టిడిపి మహిళానాయకురాలు మాజీమంత్రి అఖిలప్రియ, శ్రీశైలం ఎంఎల్ఎ చక్రపాణిరెడ్డిల మద్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటున్నది..ఈవైరం ఈనాటిదికాదు.భూమానాగిరెడ్డి నంద్యాల రాజకీయ ప్రవేశం చేసిన దగ్గరనుంచి ఇరువర్గాలమద్య ఆదిపత్యపోరు కొనసాగుతున్నది..మొదట భూమా నాగిరెడ్డి శిల్పామోహనరెడ్డి ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి మద్య ఆరంభమయ్యింది. ఆ తరువాత భూమా మరణించడంతో భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియలు వేరువేరుగా శిల్పాకుటుంబీకులపై రాజకీయ విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. గత కొద్ది మాసాల క్రితం ఒక కేసులో అఖిలప్రియ అరెస్టు అయ్యింది. ఈ అరెస్టులో చక్రపాణిరెడ్డి కీలకభూమిక పోషించరనే అనుమానంతో అఖిలప్రియ చక్రపాణిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఏ అవకాశం వచ్చినా సద్వినియోగంచేసుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నది..చక్రపాణిరెడ్డి పై కూడా గతంలో ఒక కేసులో అఖిలప్రియ హస్తం ఉందని శిల్పా అనుచరుల అనుమానం.దీంతో ఇది శాశ్వత రాజకీయ శత్రుత్వంగా మారింది. గత వారంరోజులనుండి రాయలసీమ జిల్లాలలో ఎక్కడా లేని విదంగా నంద్యాల కేంద్రంగా ఆళ్లగడ్డ టిడిపి ఇంచార్ఝి అఖిలప్రియ, శ్రీశైలం ఎంఎల్ ఎ చక్రపాణిరెడ్డిలు చేసుకుంటున్న రాజకీయ విమర్శలు ఎటు దారితీస్తాయోనన్న చర్చ సాగుతున్నది..
నంద్యాల మండలంలోని పాండురంగాపురం గ్రామంలోని శిాల్పా రియల్ ఎస్టేట్ లోజరిగిన దారుణ సంఘటన శిల్పా చక్రం అనుచరుల పనేనని అగ్గిమీద గుగ్గిలం అయ్యింది అఖిల.దానికి కౌంటర్ చక్రపాణిరెడ్డి తీవ్రస్థాయిలో ఇచ్చారు..ఎలాంటి విచారణకు అయినా సిద్దమేనని మీతల్లి మరణంతో ఎంఎల్ఎ అయ్యావ్..మీతండ్రి మరణంతో మంత్రి అయ్యావ్ తప్ప నీకు ప్రజలమద్దతు ఎక్కడిదని చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు..దీంతో అఖిల ప్రియ మరోసారి శివాలు ఎత్తింది..శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు మండలంలోని లింగాపురం గ్రామంలో మైనారిటీ మహిళపై అఘాయిత్యం జరిగిందని దీనికి ప్రత్యక్షంగా నీ డ్రయివర్ అయితే పరోక్షంగా నీవు ఉన్నావని ఆరోపించింది…ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ముందుకు సాగడంపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నది..శిల్పావ్యతిరేకులు అఖిల ఆరోపణలకు జై కొడుతుండగా చక్రపాణి అనుచరులు తప్పుడు ఆరోపణలతో ఎంతకాలం రాజకీయం చేస్తావని అఖిలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.మొత్తంమీద అదికారపార్టీలో ఉన్న శిల్పా కుటుంబీకులకు అంటగడుతూ జరుగుతున్నవిమర్శలకు ఎక్కడ పులిస్టాప్ పడుతుందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడిాంది..