జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
మరోసారి అహోబిళం క్షేత్రం మారబోతున్నది.అహోబిళం క్షేత్రంలో ప్రతి యేడాది జరిగే బ్రహ్మోత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని నల్లమల గిరులను జనసంద్రంగా మారుస్తారు.అయితే ఈసారి జ్వాలాప్రయోగ సెంట్రల్ ట్రస్టు ఆద్వర్యంలో 130 వ మహాయగ్నంను శ్రీధర్ గురూజి ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ యగ్నం పిబ్రవరి 7వతేదీనుండి 17 వతేదీ వరకు జరుగుతుంది. పిబ్రవరి 10,12,17 వతేదీలలో పూర్ణాహుతి,జనార్ధన స్వామి అవతారోత్సవం వేడుకలను వైౌభవంగా నిర్వహిస్తారు.ఈమూడురోజులలో లక్షమందికి పైగా పాల్గొన వచ్చని అంచనా వేస్తున్నారు. దిగువ అహోబిళంలోొ జరిగే ఈ మహా యగ్నానికి భారీ ఎత్తున శ్రీదర్ గురూజి ఆద్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు..పదిరోజులపాటు జరిగే వేడుకలలో పాల్గొనే భక్తులకు ఉచితంగా భోజనము,అల్పాహారం ఏర్పాటుచేస్తున్నట్లునిర్వహకులు తెలిపారు..కార్యక్రమంలో విశేషాలను తెలుసుకోవడానికి 9444066669 ను సంప్రదించాలని నిర్వహకులు తెలిపారు.
Good post