జనాస్ట్రం ప్రతినిధి మారం రెడ్డి జనార్దన రెడ్డి
నంద్యాల ఎంపీ బరిలో కె.వి.సుబ్బారెడ్డి
టిడిపి టిక్కెట్ పై ద్యాస … చంద్రబాబు పై ఆశ
ఎంత ఖర్చు పెట్టుకొవడానికైనా సిద్దం
భారీగా పరిచయాలు
తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల పార్లమెంట్‌కు పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలో ఆశావహులు సిద్ధ పడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్న సస్పెన్స్ కొనసాగుతున్నది. కొత్తగా కర్నూలులో విద్యా సంస్థలు నడుపుతున్న కె.వి.సుబ్బారెడ్డి తెర పైకి వచ్చారు. గత దశాబ్ద కాలం నుంచి వైసిపిలో కొనసాగిన కె.వి.సుబ్బారెడ్డి వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో లోకేష్ సమక్షంలో టిడిపి లోచేరారు. వైసిపిలో నంద్యాల, కర్నూలు జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్లు ఇస్తామని హామి ఇచ్చి ఎగ్గొటారని అందువల్ల టిడిపిని ఆశ్రయించినట్లు లోకేస్‌కు వివరించినట్లు తెలుస్తొంది. నంద్యాల ఎంపీ అయిన తనకు అనూకులం అని సుబ్బారెడ్డి లోకేష్‌కు వివరించారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఒకటి నర్ర దశాబ్దం పాటు కె.వి.సుబ్బారెడ్డి పేరు మీదా డ్రిగ్రీ, పిజి విద్యా సంస్థలు నడపడం జరిగిందని అంతకముందు చాగలమర్రి డిగ్రీ కళాశాలలో ఆంగ్ల భోదకుడిగా ఎయిడెడ్ పాఠశాలలో పనిచేశానని దీంతో బనగానెపల్లె, నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయని లోకేష్‌కు వివరించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని కలుగొట్లలో తాను వివాహాం చేసుకున్నానని దీంతో తాన భార్య తరఫు బంధువులు కుడా పెద్ద సంఖ్యలో ఉన్నారని వారు తన గెలుపుకు కృషి చేస్తారని లోకేష్ కు వివరించారు. అలాగే కర్నూలు పట్టణంలో తన సొంత విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని నందికొట్కూరు, పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో కుడా పరిచయాలు ఉన్నాయని అందువల్ల తనకు గెలుపు కష్టం కాదని వివరించినట్లు సమాచారం. ఎన్నికల పరిచయం కుడా ఉందని మూడు దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేశానని కుడా వివరించారు. పార్లమెంట్‌కు వైసిపి తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎంత మొత్తం ఖర్చు చేసిన అంత మొత్తంను తనకు ఇవ్వడానికి తన దగ్గర చదివిన పూర్వ విద్యార్థులు, బంధువులు, స్నేహితులు సిద్ధంగా ఉన్నారని ఇలా అన్ని అర్హతలు ఉన్న తనకే టిక్కెట్ ఇవ్వాలని సుబ్బారెడ్డి లోకేష్ కు వివరించినట్లు సమాచారం. సర్వే చేసి ఒక నిర్ణయానికి వస్తామని లోకేష్ హామి ఇచ్చినట్లు తెలుస్తొంది.