జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
!వైసిపి రేసులో పోచా,శిల్పా,ఆలీ,అంజాద్ భాష
!టిడిపి రేసులో మాండ్ర, బైరెడ్డి, ఫరూఖ్
నంద్యాల పార్లమెంట్ అభ్యర్థులు ఏవరో తేలక అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. నంద్యాల ఎంపీగా గెలుపొందిన వారికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీలు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగాను, పివి నరసింహరావు ప్రధాన మంత్రిగాను, పెండెకంటి వెంకటసుబ్బయ్య కేంద్ర మంత్రిగాను ప్రాతినిధ్యం వహించడంతో నంద్యాలకు ఈ గౌరవం దక్కింది. దీంతో ఈ సారి ఎవరెవరికి టిక్కెట్లు వస్తాయి. ఎవరు గెలుస్తారు అనే అంచన వేస్తున్నారు. ప్రస్తుతానికి 2019లో పోటీ పడిన పోచా బ్రహ్మానందరెడ్డి వైయస్ఆర్సిపి తరపున, మాండ్ర శివనందా రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. పోచా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. ఇప్పటికి వీరిద్దరే బరిలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి స్థానంలో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మాండ్ర శివనందారెడ్డితో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ పేర్లు కుడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైయస్ఆర్సిపి తరపున ఎంపీ పోచాతోపాటు శిల్పా మోహన్ రెడ్డి, మైనార్టీల తరపున రాష్ట్ర మంత్రి అంజాద్ బాషా (కడప), ఫిరోజ్ ఖాన్ (కర్నూలు), సినీనటుడు ఆలీ పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరు కుడా తమకే టిక్కెట్ దక్కాలని పార్టీ నాయకుల పై వత్తిడి తెస్తున్నారు.మొత్తంమీద ఈమద్యకాలంలో ఎంతమంది తెరపైకి వచ్చినా బి పారాలు అందుకునేంతవరకు ఈటెన్షన్ కొనసాగుతుంది.