జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డిొ
కుట్రల ఉచ్చు లో నరసయ్య ?
*నేరం నర్సయ్యది కానే కాదు
*పోలీస్ లు దగ్గర నోరు మెదపడం లో నరసయ్య విఫలం
*గతం లోకూడా కుట్రలు జరిగాయి
*నర్సయ్య కు భక్తులు ఆవేదన

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో 5kg ల వెండి మాయం నేరం లో నరసయ్య కుట్రలకు బలై పోయారని పలువురు దేవాదాయ శాఖ ఉద్యోగులు,భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…నిజంగా నర్సయ్య నోరు తెరిచి ఉంటే అదే శాఖలో మరికొందరు అధికార్లు పై కూడా కేసులు నమోదు అయ్యేవి అనే చర్చ సాగుతున్నది…ఆలయ పూజారి కిశోర్ శర్మ కు ఇఓ గా పనిచేస్తున్న సమయం లో నరసయ్య అధికారికంగా తీసుకొని తిరిగి అలంకరణ పేరుతో 5kg ల వెండిని పూజారికి అప్పగించినట్టు తెలిసిందని సందట్లో సడేమియా అనే సామెతను మై మరిపించే విదంగా వెండి అమ్మకాలు (పూజారి) జరిగినట్టు చర్చ సాగుతున్నది… మొత్తం మీద నర్సయ్య కు ఈనేరం తో సంబంధం లేదని ఐతే నర్సయ్య తో భారీగా లబ్ది పొందిన అధికారులు నోరు మెదపక పోవడం పై నర్సయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….నా టైమ్ బాగా లేక ఇంత గోర నిందను పడాల్సి వచ్చిందని…తాను ఏ నేరం చేయలేదని తనను కలిసిన వారితో నర్సయ్య చెప్పినట్టు తెలుస్తుంది… అంతే గాక నర్సయ్య నిబద్ధత తెలిసిన ఒక ప్రైవేట్ దేవాలయం నిర్వాహకులు (రిటైర్ ఐన నర్సయ్య) పెద్ద ఉద్యగం ఇస్తామని ఆహ్వానం చేసి నట్టు తెలుస్తుంది..ఐతే అదే ఉద్యగం ఆశిస్తున్న మరి కొందరు ఈ నేరం మోపి డామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు మరి కొందరు అనుకుంటున్నారు…మొత్తం మీద త్వరలోనే కుట్రలు వెలుగు లోకి వస్తాయని…నర్సయ్య నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన శ్రేయోభిలాషి లు అంటున్నారు….