జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
నంద్యాల నుండి రేణిగుంట వెల్లే రైలులో మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని వైసిని నేత నంద్యాల మునిసిపల్ కౌన్సిలర్ సన్నల సాయిరాం రెడ్డి రైల్వే అదికారులను కోరారు..

నంద్యాల నుండి రేణిగుంట వెళ్లే రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడికి చేరుతుంది మరల మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 8:30 నంద్యాల చేరుతుంది ఈ రైలు నంద్యాల నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది కానీ దాదాపుగా ఏడు గంటలు ఈ ప్రయాణంలో ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం వల్ల ప్రయాణికులందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ,మహిళలు వృద్ధులు ,వికలాంగులు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని నంద్యాల డివిజన్ సంబంధిత రైల్వే అధికారికి వినతి పత్రం అందించడం జరిగింది దాంతోపాటు ఈ రైలు ప్రతిరోజు ఒకసారి మాత్రమే తిరుగుతుంది అవకాశం ఉంటే మరోసారి ఏర్పాటు చేయాలని వారికి వినతిపత్రం ద్వారా అందించడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి అధికారి ఈ అంశాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది