జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
✤ దేశ వ్యాప్తంగా మొదటిరోజే 5వేలమంది దీక్షలు
✤ నంద్యాలలోనే రెండువేలమందికి పైగా దీక్షలు
✤ 42రోజులపాటు కఠోర దీక్షకు సిద్దమైన భక్తులుః
దేశ స్థాయిలో ఓ గుర్తింపు పొందిన నంద్యాల జగజ్జనని దేవాలయం దీక్షలను 25 వసంవత్సరం 5వేల మంది సోమవారం తీసుకున్నారు..ఒక్క నంద్యాలపట్టణంలోని జగజ్జనని దేవాలయంలోనే రెండు వేల మందికి పైగా పురుషులు, స్త్రీలు,మైనర్ బాలికలు, బాలురు తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మరో 2 వేల మంది ఆంద్రప్రదేశ్ లోని వివిద జిల్లాలలో తెలంగాణా, కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో తీసుకున్నట్లు ఆలయ నిర్వహకులు పుల్లయ్య ,నారాయణలు తెలిపారు..దేశంలోనే రెండవ ఆలయంగా కొనసాగుతున్న జగజ్జనని ఆలయంలో 25 సంవత్సరాలనుండి ఈ దీక్షలను ఆరంభించారు..42 రోజులపాటు జరిగే దీక్షలకు స్పందన అదికంగా ఉండటం పట్ల ఆలయ నిర్వహకులు సంతోషం వ్యక్తంచేశారు..ప్రతియేటా దసరా ఉత్సవాలలో ఈ దీక్షలను ఆరంభించి కార్తీక మాసంలో ముగిస్తారు..నంద్యాల పట్టణంలోని జగజ్జనని ఆలయంలో నిత్య అన్నదానంలో భాగంగా వీరికి ప్రసాదాన్ని మూడు పూట్ల అందచేసే ఏర్పాట్లను ఆలయ నిర్వహకులు ఏర్పాటుచేశారు..భక్తుల సహకారం కూడా ప్రసాద వితరణకు ముందుకు వస్తున్నారని అన్నారు..దాదాపు 2వేల మంది ఉదయం నుంచి రాత్రి వరకు దీక్షలు తీసుకోగా వారికి అమ్మవారు ఆశీస్సులు అందించాలని కుటుంబసభ్యులు మరో రెండు వేల మంది రావడంతో ఆలయం కిటకిటలాడిపోయింది..పూజారులు 18 గంటలపాటు వీరికి దీక్ష ఆశీస్సులను అందిస్తూ వచ్చారు..