జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
————————–
* బయటకు రాకుండానే డైరెక్షన్
* ప్రజలకు యిష్టంలేని పనులు ఒప్పుకోదు
* మంత్రికి తెలియకుండా ఎన్నో మంచి పనులు
* ఫరూక్ ఒడి దుడుకుల సమయం లో గట్టి అండ
* ఫిరోజ్ తో కలిపి గత ఎన్ని కల్లో సూపర్ ఉమెన్ ప్లాన్స్
ప్రస్తుత రాష్ట్ర మంత్రి Nmd ఫరూక్ రాజకీయ విజయాలలో శుక్రవారం అల్లా దగ్గరికి వెళ్ళిన ఆయన సతీమణి షహనాజ్ కీ రోల్ ప్లే చేశారని విశ్లేషకులు అంటున్నారు.
40 ఏళ్లుగా ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్న ఫరూక్ కు ప్రతిసారి దైర్యం ఇస్తూ రాజకీయల్లో వెనుకడుగు వేయలేదు అంటె అది షహనాజ్ తీసుకున్న నిర్ణయాలు అని ఆయన తో రాజకీయం చేసిన ఫ్రెండ్స్ జనాస్త్రం తో పేర్కొంటూన్నారు.
40 ఏళ్ల ఫరూక్ రాజకీయ జీవితంలో,ఎక్కడ విమర్శలకు తావులేని విదంగా ఆయనతో జీవితం గడిపిన షహనాజ్ యేడాది నుంచి మృతువు తో పోరాటం జరిపి రంజాన్ మాసంలో మృతి చెందడం ఆమె చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు.
సమాజంలో ప్రజలు ఇష్టపడని పనులు ఇంట్లో ఎవ్వరూ చేసిన ఒప్పుకోరని వాటిని సవరించుకొనే వరుకు పట్టువీడరని, ఫరూక్ అనుచరులు జనాస్త్రం తో పేర్కొంటున్నారు.
ఫరూక్ బై పాస్ చేసుకున్నప్పుడు,కరోనాతో బాధ పడినప్పుడు డాక్టర్లతో పోటీపడి ఫరూక్ కు సేవలు చేశారని విశ్లేషకులు అంటున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫరూక్ కు తెలియకుండా ఆయన తనయుడు ఫిరోజ్ కు డైరెక్షన్ ఇస్తూ ముందుకు నడిపించారని కూడా పలువురు ఫరూక్ ఫ్యాన్స్ అంటున్నారు.
మొత్తం మీద ఫిరోజ్ ను తండ్రి కి తగ్గ తనయుడు చేయడంలో కీలక పాత్ర పోషించారనే చర్చ కొనసాగుతున్నది.
మొత్తం మీద ఫరూక్ రాజకీయ జీవితం లో సూపర్ ఉమెన్ గా కొనసాగిన షహనాజ్ మరణం కుటుంబం కు తీరని లోటని పలువురు నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అంటున్నారు.