జనాస్ట్రం ప్రతినిధి మారంరెడ్డి జనార్దన్ రెడ్డి
—————————-
* ప్రతి 5 ఏళ్లకు 20 శాతం వరకూ భక్తులు పెరుగుదల
* వసతులు గురించి ఆలోచించరు
* స్వామిపై భక్తి అంత గట్టిది…
* చివరి 6 రోజులలో భారీగా భక్తులు
* 50 శాతం భక్తులు ఏళ్ల తరబడి నుంచి వస్తుంటారు
అహోబిల క్షేత్రం లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు ఎప్పటి కప్పుడు పెరుగడం వెనుక ఇక్కడ వెలసిన నరసింహ స్వామి పై నమ్మకం అధికంగా ఉండడం వల్లనేనని భక్తులు చెబుతున్నారు.ప్రతి ఐదేళ్లకు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే వారి సంఖ్య 10 నుంచి 20 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం తో 50శాతం మంది భక్తులు ప్రతి ఏడాది ఎన్నో తరాల తరబడి వస్తుంటారు.వీరిలో 30 శాతం మంది ఇక్కడ వెంట్రుకలు సమర్పించుకుంటూ ఉంటారు .ఇలా ఎన్నో రకాలుగా స్వామి భక్తి తో పెన వేసుకుని భక్తులు ఉన్నారు.ఇక్కడికి వచ్చే భక్తులలో బ్రహ్మోత్సవాలలో 50 శాతం మంది భక్తులు మొదటి 5రోజులలో వచ్చి ఎగువ,దిగువ అహోబిలం నరసింహస్వామి ఆలయం లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.మిగిలిన 50 శాతం భక్తులు చివరి 6 రోజులలో జరిగే కళ్యాణం, రథం ఉత్సవాలు,గరుడ సేవ వేడుకలలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేస్తారు.ఇది అహోబిలం బ్రహ్మోత్సవాలను తిలకించే భక్తుల గురించి ..