జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్దనరెడ్డి
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శ్రీకృష్ణ భగవానునిగా అలంకరించి ప్రత్యేక పూజలు, ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయం వీధులలో వేద పండితులు మేల తాళాల నడుము ఊరేగింపు నిర్వహించారు. రఘు అహోబిలంలోని గరుడాద్రి పర్వత పంక్తులలో మంగళవారం రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.