జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
*6 మంచి నీటి కేంద్రాలు
*తొక్కిస లాటకు నో చాన్స్
*భారీ గా ఉచిత మెడికల్ క్యాంప్ లు
*15 తేదీ వరకు బ్రహ్మ ఉత్సవాలు
అహోబిలం బ్రహ్మ ఉత్సవాలు లో పాల్గొనే భక్తులకు నరసింహ స్వామీ ఉత్సవాలు లో పాల్గొనే భక్తులకు భగవంతుని దర్శనం కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత వారీ సేవకు ఇస్తామని ఆలయ ప్రధాన మేనేజర్ మురళి దరన్ విలేకరులతో అన్నారు.. ప్రతి భక్తుడు సంతృప్తి గా ఇంటి కి చేరుకోవాలి అని స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు..ఎంత మంది భక్తులు దర్శనం,ఉత్సవాలు తిలకించడానికి వచ్చిన సంతృప్తి చెందే విధంగా ఏర్పాట్లను చేశామని అన్నారు
*ఎగువ,దిగువ అహోబిలం నరసింహస్వామి ఆలయం లలో Q లైన్ లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు.
*స్వచ్ఛమైన తాగు నీటి కోసం రెండు పైన,4 కింద ఆర్. ఒ ప్లాంట్ లను ఏర్పాటు చేశారు.
*ఉచిత అన్నదాన కార్యక్రమం 12 గంటల నుంచి 15 గంటల ఏర్పాటు చేస్తున్నారు.
*దర్శనం కోసం వచ్చిన భక్తులు అనారోగ్యం కు గురై తే వారి కోసం సీనియర్ డాక్టర్ లు మందులు కూడా ఏర్పాటు చేశారు