జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్డనరెడ్డి
—————-
* భక్తులకు ఆసక్తి కలిగె గని
* 1989 ముందు భారీ ప్రయత్నాలు
* టైగర్ లక్ష్మి నారాయణ అడ్డుకున్నారు
* పోలీసుల ప్రయత్నాలు శభాష్
* ఫీవర్స్ ను లెక్క చేయని పోలీసులు
సౌత్ ఇండియా లోనే అతి పెద్ద శక్తి వంతమైన వైష్ణవ ఆలయాల్లో ఒకటైన అహోబిలం నరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాల్లో భక్తులు ఆసక్తిగా తిలకించేది ఒకటి ఉంది.ఇది వింటే షాక్ గురి అవుతారు.ఎగువ అహోబిలం ఉగ్ర నరసింహ స్వామి ఆలయంకు ఎదురుగా ఖనిజాల గని ఉంది.ఇది కేవలం చరిత్ర వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది.దీని జోలికి వెళ్తే మటాష్ అని అంటారు భక్తులు.ఆలయం నిర్మాణం జరిగే సమయం లో ప్రస్తుతం కోట్లు విలువ చేసే బంగారం,తదితర ఖనిజాలను ఒక గని త్రవ్వి అందులో వేసిన తరువాతే ఆలయం నిర్మాణం చేపట్టినట్టు భక్తులు చెబుతారు.ఈ గవిని పగలగొట్టి అందులోని విలువైన ఖనిజాలను దొంగిలించుకుని పోవాలని చూశారు.ఈ ప్రయత్నం చేసిన వారు ప్రమాదంలోనూ ఇతర కారణాలతో మృతి చెందారని చెబుతూ ఉంటారు.ఆలయం 30 ఏళ్ల కిందట కాకులు దూరని కారు అడవి..చీమలు దూరని చిట్టడవి అయిన నల్లమల అడవుల్లో ఉంది.అప్పట్లో ఈ ఖనిజాల గని ని కాపాడుకోవడానికి నల్లమల టైగర్ గా పిలిచే లక్ష్మినారాయణ,భక్తుల సహకారంతో కటంజనాలను వేయించారు.లక్ష్మి నారాయణ ఆలయ మేనేజర్ గా పని చేస్తు,దొంగలు,అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం గా ఉన్నారు.ఆయన కొరకరాని కొయ్య గా మారడంతో కొద్ది ఏళ్లపాటు తోక ముడిచారు.ఆ తరువాత 1989 తరువాత అప్పటి సిఎం ను బురుడి కొట్టించి అధికారికంగా విలువైన నగలు ఉన్న గనిని బ్రేక్ చేయాలని ప్రయత్నం చేసారు.ఆలయంకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా యంత్రాలతో రంద్రం వేసి నగలను బయటకు తీసే ప్రయత్నం చేశారు.అప్పట్లో నేను (మారం రెడ్డి జనార్ధన రెడ్డి)ఒక ప్రముఖ పత్రిక లో ఆళ్లగడ్డ రిపోర్టర్ గా పనీ చేస్తూ అక్రమాల కుట్రలను వెలుగు లోకి తేవడం జరిగింది.ఈ ప్రాంత ఎమ్మెల్యేలు,ఎంపీలు కొందరు అక్రమార్కుల కు సహకారం ఇచ్చారు.నా పై కూడా వార్తలు రాయకుండా వత్తిడి తెచ్చారు..నేను మాత్రం రాజి కాకుండా ఒంటరి పోరు చేశాను.నా కథనాలకు న్యూస్ పేపరు సంస్థ అధినేత సంపూర్ణంగా సహకారం అందించారు.దీంతో పోలీసు ఉన్నత అధికారులు స్పందించారు.అప్పట్లో శక్తివంతమైన గన్ లు కలిగిన పోలీసులను రంగంలోనికి దింపారు.పాపం పోలీసులు మాత్రం కొండ దోమలు కుట్టించుకుంటూ ఫీవర్ లకు గురిఅవుతూ ఖనిజాల గని ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు విజయ వంతం చేసారు.ఇక్కడ ఖనిజాలు బయటకు తీసే బృందం చేసిది ఏమి లేక వెను తిరిగారు.ఐతే నా దగ్గర ఎలాంటి ఆధారం లేకపోయి నప్పటికీ వెను తిరిగి వెళ్తున్న బృందం కడపకు సమీపం లోని చెన్నూరు గ్రామం దగ్గర ప్రమాదానికి గురై అందులో కీలకమైన వారు మృతి చెందినట్టు స్థానికులు కథనాలుగా చెబుతూ ఉంటారు.ఈ ఖనిజాల గని ని ఉగ్ర నరసింహ స్వామి అక్రమార్కుల నుంచి కాపాడుకుంటున్నారు.1989 తరువాత దొంగలు రావడం రెక్కి నిర్వహించడం చేతకాక వెను తిరిగారని అంటున్నారు.మొత్తం మీద ఎగువ అహోబిలంలో నరసింహస్వామి ఆలయం సందర్శించే పర్యాటకులు,భక్తులు దర్శనం చేసుకోవలసిందే..