ఘనంగా అహోబిలం బ్రహ్మ ఉత్సవాలు

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

*లక్ష మందికి పైగా భక్తులు
*దక్షినాది రాష్ట్రాల నుంచి జనం రాక
* ఈనెల 11 నుంచి 15 వరకు
* ఆరు రోజులు 3 ప్రధాన వేడుకలు

ఈనెల 5 నుంచి ప్రారంభమైన అహోబిలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి..  అహోబిలం నరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాలు కు నాలుగురోజులలోనే ఒక లక్ష మంది కి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలనుండి భక్తులు అహోబిళం బ్రహ్మోత్సవాలకు అదికసంఖ్యలో హజరవుతారు.
మూడు ప్రధాన ఉత్సవాలు
———————–
ఎగువ అహోబిలం నరసింహస్వామి దేవాలయం లో ,దీగువ అహోబిలం నరసింహస్వామి ఆలయం లో ఒకటే ఉత్సవాలను  వేరు వేరు గా జరుపుతారు..ఒక్క రోజు జరిగే ఉత్స వాల కు కనీసం 25 వేల మంది హాజరు అవుతారని భావిస్తున్నారు..వేడుకలను విజయవంతం చేయడానికి ఇప్పటికే అహోబిలం పీఠాది పతి అహోబిలం చేరుకొని ఒక వైపు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..నంద్యాల ఆర్డీవో,ఆళ్లగడ్డ డీఎస్పీ లు అన్నీ శాఖల అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలు పై అవగాహన కల్పిస్తున్నారు..ఎంఎల్ఏ అఖిల ప్రియ ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు..
కళ్యాణం రోజు నుంచి..
పద్మ సాలియులు తమ ఇంటి ఆడబిడ్డ గా లక్ష్మి దేవి అమ్మ వారీని భావిస్తారు..అందుకే స్వామి వారీ కళ్యాణం ను ఆ కులస్తులే 11 తేదీ ఎగువన,12 తేదీ దిగువన ఆలయాలలో సాయంత్రం జరిపిస్తారు..ఈ రోజు నుంచి జనం అహోబిలం వైపు పరుగులు తీస్తారు..13 తేదీ ఉదయం ఎగువ న,14 తేదీ ఉదయం దిగువన రదోత్సవ వేడుకను ఘనంగా జరుపుతారు..ఉదయం పూట జరిగే ఏకైక ఉత్సవం కావడం తో భక్తులు పోటెత్తుతారు..14 న ఎగువ,15 తేదీన దిగువ అహోబిలం నరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాలు ముగింపు లో భాగంగా గరుడ ఉత్సవం అంగ రంగవైభవంగా జరుగుతుంది..రాత్రి ఉత్సవాలు ఐనా జనం ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు..మరుసటి రోజు ఉదయం తెప్పో త్సవ  వేడుకను కూడా కనుల పండుగ గా జరిపి వేడుకలకు ముగింపు పలుకుతారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *