శ్రీ శైలం లో తొక్కిసలాటకు నో ఛాన్స్

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

*దేవుడా..దేవుడా నీదే భారం

*సీసీ కెమెరాలు 24గంటలు పరిశీలన
*సోషియల్ మీడియాలో వచ్చే స్క్రోలింగ్ లు కూడా
*ముగిశివరుకు టెన్సెన్..టెన్షన్

దేశం లోని పలు రాష్ట్రాల నుంచి శివరాత్రి కి శ్రీ శైలం నుంచి వచ్చే భక్తులు తొక్కిసలాట జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు..సిఎం తో ఎండోమెంటు మినిస్టర్,లోకల్ ఎంఎల్ఏ బుడ్డా రాజశేఖర్ రెడ్డి,జిల్లా కలెక్టర్, ఎస్పీ తో పాటు ఈఓ శ్రీనివాసరావు మరి కొన్ని జిల్లాల ఫారెస్ట్ ,ఇతర శాఖల అధికారులు చర్యలు తీసు కుంటున్నారు.

తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతలపై పోలీసుల నిఘా 

జిల్లా ఎస్ పి అధిరాజ్ సింగ్ రాణా శెలవులో వెళ్లడంతో కర్నూులు ఎస్ పి విక్రాంత్ పాటిల్ అదనపు భాద్యతలు తీసుకుని  గత కొద్దిరోజులనుంచి నంద్యాల ఎ ఎస్ పి యుగంధర్ బాబు ఆద్వర్యంలో పోలీసు ఉన్నతాదికారులు తొక్కిసలాటకు అవకాశం లేకుండా చర్చలు జరుపుతున్నారు

మొదట Q లైన్ లు,ఆతరువాత బోజనాలు,ఆర్టీసీ ప్రత్యెక బస్సులుప్రసాదాలు ఇచ్చే చోట తదితర ప్రాంతాల ను గుర్తించారు..వీటి అన్ని చోటల 24 గంటల పాటు సీసీ కెమరాలను 25 చోట్ల దాదాపు 600 ఏర్పాటు చేసి ప్రత్యెక సిబ్బంది చూస్తుంటారు..అక్కడ ఉండే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంటారు..తొక్కి సలాటకు అవకాశం లేకుండా Q లైన్ లను ప్రసాదాల కౌంటర్ లను పెద్ద సంఖ్యలో పెంచివేశారు.. సోషియల్ మీడియాలో వచ్చే స్క్రోలింగులను వేగంగా పరిగణ లోకి తీసుకోవాలని భావిస్తున్నారు..ఫిబ్రవరి 19 తేదీ నుంచి మార్చి 1 తేదీ వరుకు 8నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు..శివ భక్తుల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..అమలు చేస్తే తప్ప లాభం లేదని అధికారులు భావిస్తున్నారు.మొత్తం మీద చిన్న సంఘటన చోటు చేసుకోకుండా ప్రతి భక్తుడికి సిబ్బంది అందు బాటులో వుండాలనే ఆదేశాలు ఉన్నాయి..మొత్తం మీద ఉత్సవాలు ముగిసే వరకు అధికార్లు బిక్కు బిక్కు మంటూ విధులలో పాల్గొనవలసిందే  అంటున్నారు..ఒక్క మాట లో చెప్పాలంటే ప్రశాంతంగా ఉత్సవాలు జరగాలని  భక్తులకంటే అధికారులు, సిబ్బంది శ్రీశైల మల్లన్న ను జాతర ముగిసే వరకు మొక్కు కోవాల్సిందే. అంత మంచి జరగాలని  జనాస్త్రం కోరుకుంటోంది..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *