✤జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
✤ఈయేడాదితో 14 యేళ్లు
✤ప్రతియేటా 80నుంచి 90 వేల మందికి అన్నదానం
✤భక్తుల సహకారం అమోఘం
✤రోజుకు 18 గంటలు అన్నదానం
✤200 మంది స్వచ్చంద సేవకుల రాక
శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈనెల 18 వతేదీనుండి 24 వతేదీ వరకు వెంకటాపురం నుండి కైలాస ద్వారం మద్యన ఉన్న బైర్లూటి ఆంజనేయ స్వామి దగ్గర రోజుకు పదివేలకు తక్కువ కాకుండా మొత్తం 80 నుంచి లక్షమందికి అన్ స్టాపబుల్ అన్నదానం నిర్వహించాలని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ అర్చకులు కంపమల్ల పుల్లయ్య ,వీరయ్య కుటుంబీకులు నిర్ణయించారు..గత 13 సంవత్సరాలనుంచి ఈ అన్నదానంను నిర్వహిస్తున్నారు..ఇప్పటివరకు 10లక్షలమంది భక్తులకు అన్నప్రసాద వితరణ కొనసాగించారని ఈసారి ఒక్కసారే 6రోజులలో లక్షమందికైనా అన్నదానం చేయాలని నిర్ణయించారు..ఉదయం 6 గంటలనుంచి అర్దరాత్రి 12 గంటలవరకు అంటే 18 గంటలపాటు రోజుకు అన్నదానం చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ స్వామి,సురేషులు అన్నారు..ఇందుకు అయ్యే ఖర్చులో సగం మొత్తం భక్తులు వస్తువు రూపంలోె అందచేస్తున్నారన్నారు..బియ్యం,కందిబేడలు,గోధుమలు, నూనె,పెరుగు,పాలు వంటి వాటిని అందిస్తున్నారని వారికి కృతగ్నతలు తెలిపారు..రోజుకు కనీసం 200 మంది స్వచ్చందంగా సేవచేయడానికి అంగీకరించారని కూడా తెలిపారు..అన్నదాన కార్యక్రమ వివరాలకోసం 94918518856,9368999996,8985285289 ను సంప్రదించాలని కోరారు..