జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
విజయవాడ ,జనవరి 25 (జనాస్త్రం న్యూస్ ) 2024వ సంవత్సరంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ప్రస్తుత నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ రాష్ట్రస్థాయి అవార్డును, ప్రశంశ పత్రాన్ని బహుకరించారు. శనివారం అమరావతిలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో అవార్డును ప్రధానం చేశారు. 2024 సాధారణ ఎన్నికలలో అత్యుత్తమ విధులు నిర్వహించిన గుంటూరు జిల్లా అప్పటి జాయింట్ కలెక్టర్ మరియు మంగళగిరి రిటర్నింగ్ అధికారి ప్రస్తుత జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారికి ఉత్తమ అవార్డు లభించింది.