♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇒గడ్డం హేమంతరెడ్డి ఆద్వర్యంలో ఓటర్ల దినోత్సవం
⇒భారీగా పాల్గొన్న విద్యార్ధి ఓటర్లు
⇒నిజాయితీ పరులకు ఓటేస్తే నిజాయితీ ప్రభుత్వాలు వస్తాయి
స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శనివారం నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ జి. హేమంత్ రెడ్డి , కళాశాల ప్రిన్సిపల్ కే బేవి సుబ్బయ్య , ముఖ్యఅతిథి బి వాన్వే (చీఫ్ మేనేజర్, కెనరా బ్యాంక్, నంద్యాల మెయిన్ బ్రాంచ్) నోడల్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ మరియు కళాశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
కళాశాల డైరెక్టర్ జి. హేమంత్ రెడ్డి మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందడానికి అయినా వినాశనం కావడానికి అయినా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఒక ప్రధానమైన కారణమన్నారు.. మనం ఉపయోగించుకునే మన ఓటు హక్కు పై మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, దేశ అభివృద్ధి ముఖ్యంగా యువత పై ఆధారపడి ఉంటుందని, ఆ యువత ఈ ఓటు హక్కును బాగా వినియోగించుకునీ, అందరికీ ఓటు యొక్క ప్రాధాన్యం తెలియజేసి వారికి సరైన అవగాహన కలుగజేస్తే మన దేశం అత్యున్నత స్థానంలో ఉంటుందన్నారు.. ఓటు హక్కు వినియోగించుకొని వారికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలు అందవు అనే ఒక చట్టం తీసుకుని వస్తే మన దేశం కచ్చితంగా అభివృద్ధి చెందుతుందని, ఎందుకంటే అప్పుడు ఆ సదుపాయాల కోసం అయినా అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు హక్కు పై మీకందరికీ సరైన అవగాహన చాలా అవసరం ఎందుకంటే మీకు అందరికీ ఇప్పటికీ ఓటు హక్కు వచ్చి ఉంటుంది దానిని ఎలా వినియోగించుకోవాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని మన దేశ అభివృద్ధికి దోహదపడాలి అని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ కి బి వి సుబ్బయ్య మాట్లాడుతూ యువతకి ఓటు ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని, 2011 జనవరి 25వ తేదీ నుంచి ఓటు హక్కు దినోత్సవం ని నిర్వహించడం జరుగుతుందన్నారు… యువతలో ఓటు హక్కు పై అవగాహన కల్పించడానికి ఈ సమావేశం అలాగే భారత ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న రూపొందించారు ఇప్పటికి 75 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. ఓటు అనేది ఒక ఆయుధం వంటిది ఆ ఆయుధంతో ఎవరిని హింసించకుండానే మార్పు తీసుకుని రావచ్చు. ఆ మార్పు అనేది కేవలం యువత అనే మీకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు.. .
ముఖ్యఅతిథి సుబోధ్ బి వాన్వె (చీఫ్ మేనేజర్, కెనరా బ్యాంక్, నంద్యాల మెయిన్ బ్రాంచ్) మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటు హక్కు (National Voters Day) కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి.. ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మనదేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. అయితే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ.. అవినీతిని పారదోలే వజ్రాయుధం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఇలా ఎన్ని విశ్లేషణలు జోడించినా.. ఓటు వేస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదన్నారు… ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు వీలుగా.. వరసలో నిలబడి ఓటు వేయడానికి ఇంకా చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసే విషయంలో గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ, నగర ఓటర్లే తడబడుతున్నారు. ఓటర్ల నమోదు పెరుగుతున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. మీరు రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి ఈ ఓటు హక్కు పై మీరే అందరికీ అవగాహన కల్పించాలి అందరినీ ఓటును వినియోగించుకోవడానికి ప్రేరేపించాలి. అయితే ప్రతిసారి కంటే ఈ సంవత్సరం 2024 లో జరిగిన ఎన్నికలలో 70% అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది ఒక మంచి విషయమే ఇలాగే ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి దానికి మీరు అందరికీ అవగాహన కల్పించాలి. ఓటు అనేది చాలా ముఖ్యమైనది ఒక్క ఓటు కూడా ఒక ఆయుధం వంటిది, మీరు వేసే ఒక ఓటు రేపటి దేశాన్ని మార్చేదిగా కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగ పరుచుకోవాలన్నారు..కళాశాల ఉపాధ్యాయురాలు రత్నం మాట్లాడుతూ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోకపోతే దేశమే నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు..