♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం
⇒ సీరియస్ గా తీసుకుని సమస్యలు పరిష్కరించండి
పిర్యాదు దారులను గౌరవించడమే కాకుండా వారిచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలోె సంబందిత అధికారులపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు రాజకుమారి గణియ హెచ్చరించారు..సోమవారం నంద్యాలపట్టణంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు హాజరయిన అధికారులను, ఉద్యోగులతో ఆమె మాట్లాడుతూ గతంలో ఇచ్చిన పిర్యాదులపై కొంతమంది అధికారులు పరిష్కరించలేదని ఇలా అయితే ఎలా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు..ఈ కార్యక్రమంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న విషయం తెలిసికూడా కొంతమంది పట్టించుకోవడంలేదని అలాంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు..ప్రతివారము పరిష్కారవేదిక పై నమ్మకంతో వందలాదిమంది వస్తున్నారని వారి నమ్మకం వమ్ముచేయవద్దన్నారు..పరిష్కారంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదిస్తే చర్యలు తీసుకోవడానికిసిద్దంగా ఉన్నానని అన్నారు..సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు విష్ణు చరణ్, డిఆర్ ఓ రాము నాయక్ తోపాటు జిల్లాలోని వివిద శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు..