♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ ఆయుష్ కు వైద్య కేంద్రాలను తనిఖీచేయండి మేడం
⇒ 5 శెంట్ల స్థలం ఇస్తే అద్బుతమైన భవనాలు వస్తాయి
⇒ 300 మంది రోగులు నిత్యం ఆయుష్ కు వస్తున్నారు.
నిరాదరణకు గురవుతున్న నంద్యాలజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆయుష్ వైద్యశాలలపై దృష్టిని సారించాలని నంద్యాల జిల్లా కలెక్టరు రాజకుమారి గణియాను స్థానికులు కోరుతున్నారు..రోజుకు 300 మంది రోగులు ఆయుష్ పరిదిలోకి వచ్చే ఆయుర్వేదం, హోమియో,యునాని వైద్యశాలలకు స్వంత భవనాలు లేక నిలబడుకునే వైద్యం పొందాల్సి వస్తుందని ఈ మూడు వైద్యశాలలకు వచ్చే రోగులు ఆందోళన చెందుతున్నారు..ప్రభుత్వ వైద్య శాలలో చిన్న భవనంలో ఈ మూడింటిని నిర్వహిస్తున్నారు..ముగ్గురు మహిళా వైద్యులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తుండటంతో రోగులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు..వారికి కూర్చొడానికి స్థలం ఉండటంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి…ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఈ మూడింటికి 5 శెంట్ల స్థలం కేటాయించి ప్రభుత్వంతో భవన నిధులను రాబడితే స్థానికి ప్రజలు మూడు వైద్యాలను పొందుతారని అంటున్నారు..ఆయుర్వేదంలో అధిక సంఖ్యలో వైద్యంపొందడానికి రోగులు ఇష్టపడుతున్నారు..కనీసం 50 పడకల ఆసుపత్రిని కూడా ఆయుర్వేదంలో ఏర్పాటుచేస్తే వివిద రోగాలకు చెందిన వారు ముఖ్యంగా మహిళలు పిజియోదెరపీ పంచకర్మ వైద్యాన్ని పొందవచ్చని కూడా రోగులు వివరిస్తున్నారు..ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్న కలెక్టరు ఒక్కసారి వీటిపై దృష్టిని సారిస్తే 5 శెంట్ల స్థలం కేటాయించే అవకాశం ఉందని అంతేకాక కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిధులు కూడా వస్తాయని రోగులు అంటున్నారు..ప్రస్తుత మూడు విభాగాలు అడ్డంగా బట్టలు కట్టుకుని రోగులకు వైద్యం చేయడాన్ని ఒకసారి జిల్లా కలెక్టరు అకస్మిక తనిఖీ చేస్తే తెలుస్తుందని స్పందనలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతోనో, జిల్లా అదికారితోనో చర్చించాలని రోగుల తరుపున జనాస్త్రం డిమాండ్ చేస్తున్నది…