♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ కఠిక నేలపై దీక్ష,..పళ్లు,టెంకాయనీరు ఆహారం
⇒ 34 యేళ్లల్లో 1400 రోజులు,837 గంటలు దీక్ష జరిగింది
⇒ ఈసారి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లే అవకాశం
యాగంటి శివదీక్షలో పాణ్యం మాజీ శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మించిన వారు ఎవరూ అగుపించరని పలువురు చర్చించుకుంటున్నారు..1991 నుంచి అన్ స్టాపబుల్ శివదీక్షను కొనసాగిస్తున్న ఏకైౌక రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో ఉండరని తెలుస్తోంది..1991 నుంచి ఇప్పటివరకు శివరాత్రి సమయంలో 41 రోజులు కఠిక నేలపై నిద్రిస్తూ పళ్లు,టెంకాయనీరు వంటివి తీసుకుంటూ దీక్షను కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటిఅని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు..ఇంతవరకు 30 ఏళ్లనుంచి దీక్ష తీసుకుంటున్న రాంభూపాల్ రెడ్డి ఇంతవరకు నాలుగు సంవత్సరాలపాటు దీక్షలో ఉన్నారని 14 వందల రోజులు దీక్షను 837 గంటలు కొనసాగించారు..ప్రస్తుత ఏడాది శివదీక్షను 19 వతేదీ తీసుకుని 35 వయేట అడుగుపెట్టారు..నా అంతిమశ్వాసవరకు రాజకీయాలతో సంబందం లేకుండా కొనసాగిస్తానని ఇందులో ఉన్న ఆనందమే వేరని కాటసాని అన్నారు..ఈసారి శివదీక్షలో ప్రయాగ్ రాజ్ కుంభ మేళకు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు..గతంలో దీక్షల సమయంలో శ్రీశైలం ,అరుణాచలం వంటి క్షేత్రాలలో పూజలు చేసేవారని ఈసారి అవకాశం దొరికితే ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లే అవకాశం ఉందని వారు అన్నారు..కుటుంబ సభ్యులతో దీక్ష తీసుకోవడం సంతోషంగా ఉందని కూడా భూపాల్ రెడ్డి యాగంటిలో పేర్కొన్నారు..