♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డిా
⇒ అహోబిలం జనంతో కిటకిట
⇒ దేవుని దర్శించుకున్న ఎంఎల్ఎ అఖిలప్రియ
⇒ అన్నదానాలలో కులసంఘాల నిమగ్నం
⇒ నమో నరసింహ అంటూ నినాదాలతో మారుమోగిన నల్లమల
అహోబిలం క్షేత్రంలో శుక్రవారం భక్తులు నరసింహస్వామి దర్శనం కోసం ఎగబడ్డారు..ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునుంచే రాయలసీమ జిల్లాలనుండి వేలాది మంది భక్తులు అహోబిళం చేరుకున్నారు..ఎగువ, దిగువ అహోబిలాలలో నేను మొదట ఉత్తర ద్వారం దాటాలంటే నేను దాటాలంటూ మహిళలు గోవిందా ..గోవిందా అనే నామస్మరణతో క్యూ లైన్లలో ముందుకుె సాగారు..వైకుంఠ ఏకాదశే కాదు ఈనెల 15 వతేదీన పారువేట ఆరంభం అవుతుందని ఆరోజు అందరూ అహోబిలం రావాలని ఆలయ అదికారులు సిబ్బంది కోరారు.. ప్రదాన అర్చకుడు రమేష్ ఆద్వర్యంలో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలలో నరసింహస్వామి,లక్షిదేవి,చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పూలతో శుచి మాలలతో అలంకరించి ఉత్తర ద్వారానికి పది అడుగుల దూరంలోనే ఏర్పాటు చేశారు..భక్తులు తన్మయంతో దర్శనం చేసుకున్నారు..వందలాది మంది గురువారం రాత్రికే చేసుకోవడంతో వసతి గృహాల నిండిపోయాయి..చివరికి అహోబిళం మాడవీదులలో రూము దొరకని భక్తులు నమో నరసింహ నమో నమో అంటూ ప్రార్ధనలు చేసుకుంటూ నరసింహ నామ స్మరణతో నల్లమల కిటకిటలాడిపోయింది..కుల సంఘాల ఆద్వర్యంలో ఉచిత అన్నదానాలను, అల్పాహారాలను ఏర్పాటు చేశారు..తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలనుండి కనీసం 2 వేల మంది ప్రత్యే క బస్సులు, ఇతర వాహనాలతో వచ్చి దర్శనం చేసుకోవడం విశేషం..పోలీసులు డిఎస్ పి రవికుమార్ నూతన సిఐ మురళీదర్ రెడ్డి శుక్రవారం ఉదయంనుంచి అహోబిలంలోనే మకాం వేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూశారు..
అహోబిలేశుని దర్శించుకున్న ఎంఎల్ఎ అఖిల ప్రియ
అహోబిల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలలో ఆళ్లగడ్డ ఎంఎల్ఎ భూామా అఖిలప్రియ,తమ బంధువులు స్నేహితులతో కలిసి పాల్గొన్నారు..ఆమె అహోబిలం చేరుకున్న వెంటనే ఆలయ ప్రదాన పూజారి రమేష్ తోపాటు స్తానిక టిడిపి నాయకులు స్వాగతం పలికారు..పూజలకు ముందే సాదారణ భక్తుల దర్శనానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడాలని సిఐ మురళీదర్ రెడ్డిని ,ఆయన సిబ్చందిని ఎంఎల్ఎ ఆదేశించారు..ఆలయంలో పూజలు వేగంగా జరిపి భక్తులకు ఆలస్యం జరుగకుండా చూడాలని రమేష్ ని ఎంఎల్ఎ కోరారు..మొత్తం మీద ఎంఎల్ఎ రాకతో దేశం వర్గాలలో ఆనందం వ్యక్తం అయ్యింది..