జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* క్యూలైన్లను కంటికి రెప్పలా కాపాడిన పోలీసులు
* నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థుల సేవ అమోఘం
* పోటు ఎత్తిన భక్తులు
* అందరికీ కృతజ్ఞతలు- మధుసూదన్ రెడ్డి
* డాక్టర్ హరినాదరెడ్డి లక్షవిరాళం
రుద్రవరం మండలంలోని వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు రావడంతో ఆలయ అధ్యక్షుడు సింగితల మధుసూదన్ రెడ్డి, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సంయుక్తంగా చర్చించుకుంటూ భక్తులకు అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా చేశారు. గురువారం సాయంత్రమే వైకుంఠ ఏకాదశి రావడంతో రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఎప్పటికప్పుడు వేలల్లో భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.నంద్యాలకు చెందిన డాక్టర్ హరినాథ్ రెడ్డి లక్ష రూపాయలు పైగా ఈ వేడుకలకు విరాళంగా ఇచ్చారు. అలాగే టిడిపి నాయకుడు నరసింహారావు వేలాదిమందికి భోజనాలు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల, ఆళ్లగడ్డ కు చెందిన భక్తులు విరాళాలు ఇచ్చారు. గతంలో లాగా ఆలయ ప్రాంగణంలో అల్పాహారం భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో దర్శనాలకు ఇబ్బంది లేకుండా పోయింది.ఆలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ ను కూడా అర కిలోమీటర్ దూరంలో కళ్యాణ మండపం కోసం సేకరించిన స్థలంలో పెట్టారు. ఈ నిర్ణయాల వల్ల భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదు, ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి 50 మంది NCC క్యాడేట్లను సేవకు పంపడంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లడంతో వేలాదిమంది భక్తులు అసౌకర్యానికి గురికాకుండా దర్శనం చేసుకున్నామనే సంతోషాన్ని వ్యక్తం చేశారు.