♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ 120 మంది సంబరాలలో సందడి
⇒ ప్రగతి ఆద్వర్యంలో వైభవంగా వేడుకలు
నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణా విద్యాసంస్ధల ఆద్వర్యంలో విద్యార్ధిని విద్యార్ధులు ముందస్తు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు..ఎస్టేట్ మేనేజరు ప్రగతిరెడ్డి ఆద్వర్యంలో విద్యార్ధిని విద్యార్ధులకు ముగ్గుల పోటీలు గాలిపటాల పోటీలను నిర్వహించి సందడి చేశారు..120 మంది విద్యార్దినులు పోటీలలో పాల్గొనగా 70 మంది విద్యార్దులు గాలిపటాలను ఆకాశంలోకి ఎగురవేయగా 50 మంది విద్యార్దినులు ముగ్గుల పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు..సామాజిక అంశాలను ప్రజలలోకి తీసుకువెల్లే విదంగా కొందరు ముగ్గులు వేయడంను రామకృష్ణారెడ్డి అభినందించారు..సంబరాలలో చైర్మన్ రామకృష్ణారెడ్డితో పాటు డైరెక్టరు హేమంతరెడ్డి ప్రిన్సిపల్ కెబివి సుబ్బయ్య ,లలితా సరస్వతి, ఇంతియాజ్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు..