♦వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వింటే షాకే♦

♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి 

⇒ సుగందాల వెంకటేశ్వరస్వామి దర్శనం

⇒ 30 వేలమందికి పైగా దర్శనం ఏర్పాట్లు

⇒ దాదాపు 16 గంటలు దర్శనానికి సిద్దం

 

దశాబ్దకాలంనుంచి నంద్యాల జిల్లా కేంద్రంలోని భగవత్ సేవాసమాజ్ అద్యక్షులు టియంసి సూరయ్య ఆద్వర్యంలో సంజీవనగర్ రామాలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రతి యేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు..ప్రతియేడాది వేలాది మంది ఒకేరోజు ఆలయాన్ని సందర్శిాంచి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారంలో దర్శనంచేసుకునే భాగ్యాన్ని భగవత్ సేవాసమాజ్ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు..ఇసుకవేస్తే రాలనంత జనం ఆలయంలో ఉదయం,సాయంత్రం అగు పిస్తున్నారంటే సూరయ్య ఆద్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లుచేస్తున్నారో అర్దం అవుతుంది..గతంలో లాగే ఈసారి కూడా జనాస్త్రం ఆద్వర్యంలో ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను చూస్తే షాక్ గురి అవ్యాల్సిందే..30 వేల మంది భక్తులు వచ్చినా వారు అందరిని నాలుగు ఐదు క్యూలైన్లు ఏర్పాటుచేసి దర్శనం కలిగించే ఏర్పాట్లను చేశారంటే మాటలా అని పలువురు పరిశీలకులు జనాస్త్రంతో పేర్కొన్నారు..గంటకు 2వేల మందిని మనస్పూర్తిగా దర్శనంచేసే భాగ్యాన్ని కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి..ప్రతి భక్తునికి ఉచిత ప్రసాదాన్ని అందిస్తూ ఇతర దేవాలయాలలో కూడా దర్శనాలు చేసుకునే విదంగా వాలంటీర్లను ఏర్పాటుచేశారు..పోలీసులు కూడా ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించే భాద్యతను తీసుకున్నారు..సిసి కెమెరాలపర్యవేక్షణలో సిటికేబుల్ లైవ్ కవరేజిలో 10 వతేది శుక్రవారం ఉదయం 6 గంటలనుండి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు..విఐపిలకు కూడా ఉచిత పాసులను ఏర్పాటుచేసి సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..చివరికి సామాన్య భక్తుల క్యూలైన్లలో వచ్చి ఉంటే బాగుండేదని విఐపిలు అనుకునే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు..జనాస్థ్రం ఇప్పుడుచెప్పేది చూసి ఆరోజు స్వయంగా మీరే చూస్తారని జనాస్త్రం ఎండి మారంరెడ్డి జనార్ధనరెడ్డి భక్తులకు వివరించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *