♥ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
♦ నామినేటెడ్ పోస్టు నాకే కావాలన్నా
♦ మంత్రి కేశవ్ తో కార్యకర్తల కోరిక
♦ నీటిసంఘాలు,మార్కెట్ యార్డులలో నియమించన్నా
♦ పార్టీ నిర్ణయం శిరోదార్యంగా పనిచేయాలి
♦ దశలవారిగా అందరికీ న్యాయం చేస్తారు
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖ అధిపతిగా కొనసాగుతున్న పయ్యావుల కేశవ్ నంద్యాలకు వచ్చిన సందర్బంగా టిడిపి హార్డుకోరు నాయకులు, కార్యకర్తలు కలుసుకుని తమకు నామినేటెడ్ పోస్టులలో న్యాయంచేయాలని కోరారు..నంద్యాలతెోపాటుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం 70 నుంచి 80 మంది కార్యకర్తలు కలుసుకుని తమకు నామినేటెడ్ పదవులు జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో కావాలని కోరారు..కొంతమంది అయితే వైసిపిలో పదవులు పొందినవారు తిరిగి ఇక్కడ కూడా పొందే యత్నం చేస్తున్నారని వారికి చెక్కు పెట్టాలని కోరినట్లు సమాచారం..ఏడు నియోజకవర్గాలలో మార్కెట్ యార్డు పదవులు తమకు కావాలంటే తమకు కావాలని దరఖాస్తులు అందించారు..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలలాంటి కేంద్రానికి ఉధ్దేశ్యపూర్వకంగానే పయ్యావుల కేశవ్ ను ఇంచార్జిగా నియమించినట్లు తెలిసింది..అవసరమయితే కఠినంగాను వ్యవహరించడంలో కేశవ్ కు ప్రస్తుత మంత్రి వర్గంలో సాటి అయ్యే మంత్రి లేరని అందువల్లే కేశవ్ నునియమించినట్లు సమాచారం..అందరికి పదవులు ఇవ్వడం దశలవారిగా జరుగుతుందని ఎవరికి అన్యాయం జరగదని,పదవులు ఆశిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు కేశవ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది..నీటిపారుదల సంఘాల ఎన్నికలలో తమకు న్యాయం జరగాలంటే తమకు న్యాయం జరగాలని కెసి కెనాల్, తెలుగుగంగ, ఇతర ప్రాజెక్టులకు చెందిన నాయకులు కొరగా పార్టీ నిర్ణయం శిరోదార్యంగా తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు..మంత్రులు బిసి జనార్ధనరెడ్డి, ఎన్ ఎండి పరూఖ్, ఎంఎల్ఎలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి,భూమా అఖిలప్రియ, గౌరు చరిత , బుడ్డా రాజశేఖరరెడ్డి,గిత్తా జయసూర్యతోపాటుగా ఎంఎల్ సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు ఎవిసుబ్బారెడ్డి,మాజీ ఎం ఎల్ ఏ భూమా బ్రహ్మానందరెడ్డి, దర్మవరంసుబ్బారెడ్డి,నరహరి విశ్వనాదరెడ్డి, ఎన్ ఎండి పిరోజ్,భూమా విఖ్యాత్ రెడ్డి తదితరులు మంత్రి పయ్యావులను కలుసుకున్నారు..అనంతరం శాసనసభ్యులతో కలిసి నీటిపారుదల శాఖాదికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్షను లోతుగా నిర్వహించారు..కలెక్టరు రాజకుమారి అద్యక్షత వహించగా జిల్లా ఎస్ పి అదిరాజ సింగ్ తదితరులు పాల్గొన్నారు.