♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
♦ కొత్తగా బళ్లారి,సూర్యాపేటలలో దూసుకువెళుతున్న ప్రజాచానల్
♦ భవిష్యత్తులో డిల్లీ బెంగుళూరు విశాఖలలో విస్తరించే యోచన
♦ అవకాశం దొరికితే కేంద్రమంత్రి మద్దతు పొందే యత్నం
తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చినదగ్గరనుండి ఎలక్ట్రానిక్ మీడియాలో దూసుకువెళుతున్న ప్రజా చానల్ అదినేత మూల్పూరి ప్రభాకర్ చౌదరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అదికారపార్టీ నాయకులతో బహిరంగంగాను ,అంతర్గతంగాను కలుస్తూ ముందుకు సాగడం వెనుక పాత్రికేయులలో చర్చ సాగుతున్నది..13 సంవత్సరాల క్రితం నంద్యాల కేంద్రంగా ప్రజా చానల్ ను ఏర్పాటుచేసి వేలాదిమంది సబ్ స్రైబర్లను పొందారు. ఎపిలోని గుంటూరుతో పాటుగా కర్నాటక రాష్ట్రంలోని బళ్లారితెలుగు వారు ఉన్న ప్రాంతంలో,తెలంగాణా లోని సూర్యాపేటతోపాటు మరికొన్ని ప్రాంతాలలో ,ఇటీవలనే విస్తరించారు..భవిష్యత్తులో విశాఖపట్నం విజయవాడ, బెంగుళూరు డిల్లీ తదితర ప్రాంతాలకు విస్తరించే యోచనలో భాగంగా ముమ్మరంగా ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది…అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆర్దిక ఇబ్బందులతో చానల్ ను ముందుకు సాగించే పరిస్థితి కష్టమయింది..అష్టకష్టాలు ఎదుర్కుంటూ ఆర్ధిక పరిస్థితులను దిగమింగుతూ చానల్ కోసం కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులు పెట్టి పెట్టుబడి పెడుతున్నారు..గత ఐదు సంవత్సరాలనుంచి వైయస్ ఆర్ సిపి పాలనలో మరిన్ని ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది..అయితే పార్టీ అదికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ వచ్చిన మూల్పూరి ప్రభాకర్ చౌదరి గత ఆరు మాసాలనుండి అదికారపార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను అందరిని కలుస్తున్నారు..అయితే ఆయన తన చానల్ ను ఏదో ఒకరోజు జాతీయ స్థాయికి తీసుకువెల్లే ఆలోచనకు ఇది సరైన సమయమని ముహుర్తం గా నిర్ణయించుకున్నట్లు చర్చించుకుంటున్నారు..ఈయనకు ప్రజా చానల్ విస్తరణకు కేంద్రంలో ఒక మంత్రి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం..మొత్తం మీద నంద్యాలప్రాంతంలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ పార్టీక్యాడర్ కు జరుగుతున్న నష్టాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాకర్ చౌదరి వ్యూహం సన్నితులకు,శ్రేహోభిలాషులకు అంతు పట్టఢం లేదు మొత్తం మీద ప్రజా చానల్ ను విస్తరించడమే ద్యేయంగా కొనసాగుతున్నారని ఆయన శ్రేయోభిలాషులు పేర్కొంటుండగా అవకాశం దొరికితే నామినేటెడ్ పోస్టుకూడా తీసుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు..మొత్తం మీద ఏది జరిగినా మంచిదేనని చానల్ విస్తరణ జరిగితే మరింత మంచిదని ఆయన శ్రేయోభిలాషులు జనాస్త్రంతో పేర్కొన్నారు..