♥ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦ వైరల్ అవుతున్న యాత్రికుల జలపాతాల వీడియోలు
♦ కుంభవృష్టిగా వర్షాలు పర్యాటక రంగానికి కొత్తశోభ
తుపాను వల్ల రైతులకు లాభనష్టాలు ఉన్నప్పటికి పర్యాటక రంగానికి మాత్రం ఆనందం కలిగిస్తున్నది..కొండ ప్రాంతాలకు ,క్షేత్రాలకు వెళ్లిన భక్తులు ఉల్లాసంతో కేరింతలు కొడుతున్నారు..రాష్ట్రంలో పలు ప్రాంతాలనుండి నూరు మంది భక్తులు యాత్రలకు వెళ్లగా అందులో 50 మంది తిరుమలకు వెళుతుంటారు..వారు కపిలతీర్థంతోపాటు తిరుమల కొండలను సందర్శించి జలపాతాలను తిలకించి ఆనంద పరవశులు అవుతున్నారు..ఇటీవల ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సాప్ట్ వేరు ఇంజనీరు సిద్దంరెడ్డి శ్రీదర్ రెడ్డి అరుణాచలం,తిరుమలకు వెళ్లాలని ప్రయత్నం చేశారు..అయితే అరుణాచలంకు వర్షాల తాకిడి అదికంగా ఉందని అందువల్ల ఎవరూ రావద్దని సంకేతాలు రావడంతో ఆయన కపిలతీర్థంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది..కపిలతీర్థ జలపాతాలను అక్కడ ప్రజలు పొందుతున్న ఆనంద అనుభూతులను వీడియోలలో చిత్రీకరించి బయటికి విడుదలచేశారు..ఇవి ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాలకు చేరుకుని కపిలతీర్ధ జలపాతాలను చాలామంది ప్రత్యక్షంగా చూసినట్లు అనుభూతులు పొందుతున్నారు..ఆపోటోలు వీడియోలు జనాస్త్రం ప్రేక్షకులకు ప్రత్యేకం