♦ ఆకస్మిక తనిఖీలతో హడల్♦

♥ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

♦ సైలెంట్ చర్యలలో కలెక్టరు టాప్

♦ ఒణుకుతున్న అవినీతి అదికారులు

♦ వైద్య సిబ్బందిపై చర్యలతో హడల్

♦ అక్రమార్కులపై కేసులు నమోదుచేయాలని ఆదేశాలు

♦ ఆకస్మిక తనిఖీలతో హడల్

అవసరం అయినప్పుడు ఆగ్రహం వ్యక్తంచేస్తూ…బాగా పనిచేసేవారిపై అనుగ్రహం వ్యక్తంచేస్తూ నంద్యాల  జిల్లా కలెక్టరు రాజకుమారి గణియా సంచలనాలకు కేంద్రబిందువుగా మారారు..హడావిడిలేకుండా ప్రచారం లేకుండా సైలెంట్ గా పనిచేస్తూ పరిపాలనను గాడిలో పెట్టడం ఆమె ద్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది…పిర్యాదులు వస్తే చాలు అక్కడ ఒకటిరెండు రోజులు ఆలస్యం అయినా వాలిపోతున్నారు…వారికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా చేస్తున్నారు..ఇటీవల డోన్ ప్రాంతంలో ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో విదులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది..అలాగే నంద్యాల ఎంఆర్ ఓ గా కొందరు అవినీతిపరులు బాద్యతలు స్వీకరించడానికి ప్రయత్నంచేయగా అదికార పార్టీ నాయకులను ఒప్పించి జిల్లా కేంద్రంలో అటువంటి అదికారులు ఉండకూడదని చెప్పారు..దీంతో అదికార పార్టీ నాయకులు కూడా సానుకూలంగా స్పందించి కలెక్టరుకే నిర్ణయాదికారం ఇచ్చారు..విజయవాడ ప్రాంతంలో తుపాను సంభవించినప్పుడు స్థానికంగా పలువురిని ప్రోెత్సహించి సహాయనిదులను కూడా సేకరించారు..ఒకటికాదు రెండుకాదు ఎన్నో నిర్ణయాలను తీసుకోవడం వలన పరిపాలన పూర్తి అద్వాన్నం కాకుండా చేశారని పలువురు పేర్కొంటున్నారు..ఆమె భాద్యతలు తీసుకున్న మొదటిసారే ఒక హాస్టలు వార్డను పిల్లల కడుపు కొడుతున్నారని పిర్యాదు అందడంతో సంబందిత అదికారిపై చర్యలు తీసుకునే యత్నం చేశారు..అయితే మొదటిసారిగా వదిలిపెడుతున్నానని హెచ్చరికలు చేశారు..నంద్యాల సబ్ రిజిస్ట్రార్ పరిదిలోని హౌసింగ్ బోర్డులో అక్రమాలు జరిగినట్లు పిర్యాదులు అందడంతో వారిపై కేసులు నమోదుచేయాలని కూడా హెచ్చరికలు సంబందిత అదికారులకు జారీచేసినట్లు సమాచారం..ఏది ఏమైనా భవిష్యత్తులో మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని పేదలకు మేలుచేస్తూ అవినీతి పరులపై కొరడా ఝళిపించే అవకాశం ఉందని సంబందిత శాఖ అదికారులు అప్రమత్తమవుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *