రెడ్డి సంక్షేమం కోసం పెడకంటి రెడ్ల సమాఖ్య పోరాటం

జనాస్త్రం ప్రతినిధి మా జనార్ధన రెడ్డి

మెడికల్ కాలేజికి బుడ్డా వెంగళరెడ్డి పేరు పెట్టాలి..

* అలాగే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు కూడా …

* యొగి వేమా రెడ్డి, కాశిరెడ్డి నాయన పేర్లు కూడా వెలుగులోకి రావాలి….

* పెడకంటి రెడ్ల సంఘానికి అనూహ్య స్పందన…..అందరి రెడ్ల కోసం పెడకంటి రెడ్ల సంఘం పోరాటం.
*
అంతర్జాతీయ పెడకంటి రెడ్ల సంఘం ఏర్పాటు చేసే అంశం పై నాలురోజుల క్రితం పత్రికలకు విదుడల చేసిన ప్రకటణకు అనూహ్యమైన స్పందన లభించినట్లు సంఘం ఏర్పాటు పై సమాలోచనలు జరుపుతున్న రిటైర్డు వి.ఆర్.ఒ కుందూరు మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు రెడ్ల సంఘాలు ఏర్పాటు అయి రెడ్ల సమస్యల కోసం పోరాటాలు జరుపుతున్నాయని, ఇందుకు ఆయన అభినందనలు తెలిపారు. కొత్తగా ఎర్పాటు చేయాలని ఆలోచిస్తున్న పెడకంటి రెడ్ల సంఘం కూడా అన్ని రెడ్ల వర్గాలకు చెందిన సమస్యలపై సంయుక్తంగా పోరాటం చేస్తూ పెడకంటి రెడ్ల సమస్యలపై కూడా పోరాడాలని నిర్నయించినట్లు తెలిపారు. రెడ్లలో ఎ ఒక్కరికి వ్యతిరెకం కాదని కూడా స్పస్టం చేసారు. పెడకంటి రెడ్ల సమస్యలపై ఎలాంటి పోరాటం చెస్తామో అంతే పోరాటం కూడా ఇతర రెడ్లు కోసం పోరాటం చేస్తామని పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆయన సమాధానం ఇచ్చారు. నాలుగు రోజులలోనే రాష్ట్రంలోని తెలంగాణా, కర్నాటక తోపాటు విదేశాలలో ఉండే పెడకంటి రెడ్లు పలు రకాల సూచనలు సలహాలు ఇస్తున్నారని ఇప్పటికే 1200 మంది పైగా ఇలాంటి సూచనలు చేశారన్నారు. ఇంత స్పందన వస్తుందని ఎవ్వరు ఊహించలేదన్నారు. ఇంతవరకు సూచనలు చేయని వారు 9989977005 సెల్ నెంబర్ కు వాట్సప్ ల ద్వారా నిర్మోహమాటంగా సమాచారం అందించాలన్నారు. సంఘం ఏర్పాటు చేసే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్నయానికి వస్తామని తెలిపారు. ఇంతవరకు అత్యదికులు పేద పెడకంటి రెడ్ల సంక్షేమంకోసం పోరాడుతూ అన్ని రకాల రెడ్ల తరుపున పోరాడాలని కూడా సూచనలు ఇచ్చారని అనారు. నంద్యాల పట్టణంలోని మెడికల్ కళాశాలకు బుడ్డా వెంగళరెడ్డి గారి పేరును పెట్టాలని త్వరలో డిమాండ్  చేస్తూ రెడ్ల ప్రజా ప్రతినిదులకు వినతిపత్రాలు అందజేస్తామని అన్నారు. అలాగే నంద్యాల జిల్లా కేంద్రములో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు నామకరణం చేయాలని కోరనున్నట్లు అన్నారు. యొగి వేమా రెడ్డి, పేదలకోసం అన్నదాన సత్రాలను నిర్మిస్తున్న కాశిరెడ్డి నాయనలను ప్రేమించే రెడ్లు ఉన్నారని ఆయన పేరుతో పలు సంస్థలు ఏర్పాటు కోసం రెడ్ల ప్రజా ప్రతినిదులపై ఒత్తిడి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *