అహోబిలం కు ప్రపంచ గుర్తింపు రావాలి..ఎంపితో సేతురామన్

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* ఎంపీ శబరిని కలిసిన కిడాంబి సేతురామన్
* యునెస్కో గుర్తింపు కోసం కృషి చేయాలి
* అహోబిలం పారువేటకు ఒక ప్రత్యేకత ఉంది

నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అహోబిల క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపులో మీ పాత్ర అతి కీలకమని అహోబిలం నరసింహస్వామి భక్తుడు కీడాంబి సేతురామన్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని కలిసి కోరారు.మంగళవారం నంద్యాల పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో శబరిని కలుసుకొని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని శబరికి గుర్తు చేశారు.అహోబిల క్షేత్రం ఆధ్వర్యంలో కొన్ని వందల ఏళ్ల నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని 36 గ్రామాలలో నరసింహస్వామి పార్వేట ఉత్సవాలు దాదాపు 40 రోజులపాటు జరుగుతాయని ఎంపీ కి సేతురామన్ వివరించారు. అయితే ఇది కేవలం సాంప్రదాయ ఉత్సవాలుగా కొనసాగుతున్నాయని ఇకనుండి ప్రభుత్వ భాగ్యస్వామ్యం అవసరమని, ఇందులో భాగంగా ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలో జరగని పారువేట ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయని వీటికి యునెస్కో గుర్తింపు రావాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం తరఫున పంపాలని కోరుతున్నట్లు సేతురామన్ వివరించారు.ఇటాచి అనే సంస్థ ఏర్పాటు చేసి తాను, సంస్థ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ద్వారా రాష్ట్ర కేంద్ర పెద్దలను గత అర దశాబ్దం నుండి కలిసి ప్రయత్నం చేస్తున్నామన్నారు.మీ ప్రయత్నం జరిగితే యునెస్కో గుర్తింపు లభిస్తుందని,మీరు కూడా అహోబిల క్షేత్రం ఉండే నంద్యాల పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆ గుర్తింపు మీకు కూడా లభిస్తుందని శబరిని కోరారు. శబరి కూడా మీ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి అక్కడినుండి యునెస్కోకు ప్రతిపాదనలు పంపేయత్నం చేస్తానని అన్నారు.సేతురామన్ వెంట ప్రముఖ న్యాయవాది మనోహర్ రెడ్డి,తెలుగుదేశం నాయకుడు విశ్వనాథరెడ్డి, సీనియర్ రిపోర్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *