♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔పిజిలో కొత్తగా రెండేళ్ల ఎంసి ఎ కోర్సు
⇔పిజిలో మొత్తం 360 సీట్లు .డిగ్రిలో మరో 360 సీట్లు
⇔అద్బుతమైన స్టాండర్ట్సు ఉండడం వల్లే ఈ భారీ సీట్లు
నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపిజి డిగ్రీ కళాశాలలకు ఎఐ సిటిసి భారీ ఎత్తున సీట్లను కేటాయించింది..గతంలో ఎన్నడూ లేని విదంగా ఒక కళాశాలకు ఇన్ని సీట్లు కేటాయించడం ఇదే ప్రదమమని పలువురు అద్యాపకులు పేర్కొంటున్నారు..ఏఐసిటిసి ఉన్నతాదికారులు డిగ్రీ ,పిజి కళాశాలలను సందర్శించి స్టాండర్ట్సును పరిశీలించారు..వందేళ్ల చరిత్రకలిగిన యూనివర్శిటీలో ఏ ప్రమాణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాణాలు ఈరెండు కళాశాలలో ఉండడం వల్లే ఈ సీట్లు కేటాయించినట్లు అద్యాపకులు తెలిపారు..రామకృష్ణా విద్యాసంస్ధల చైర్మన్ డా..రామకృష్ణారెడ్డి జనాస్థ్రంతో ఇలా మాట్లాడారు..
జనాస్త్రం… సర్ …మన కళాశాలకు మరోసారి ఎంసిఎ వచ్చిందట కదా ?
చైర్మన్ ..అవును గతంలో ఎంసిఎను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం..ఎంతోమందివిద్యార్ధులు లక్షల్లో జీతాలు పొందుతున్నారు..మరికొందరు వ్యాపారాలు చేసుకుని ఇదే విదంగా సంపాదించుకుంటున్నారు..రానురాను మూడు సంవత్సరాల కోర్సు కావడంతో విద్యార్ధులు ఎంసిఎపై ఉత్సాహం తగ్గిపోయింది..దీంతో మేముకూడా ఆకోర్సును దూరంచేశాం..
జనాస్త్రం…ఇప్పుడు ఎన్ని ఏళ్ల కోర్సు ?
చైర్మన్…ఇప్పుడు రెండేళ్ల కోర్సు మాత్రమే..అందువల్ల స్పందన అదికంగా ఉంటుంది..120 సీట్లు మంజూరు చేసింది..ఇప్పటికే స్పందన అదికంగా ఉంది..చాలామంది విద్యార్ధులు పోన్లన్లో సీట్లను అడుగుతున్నారు..
జనాస్త్రం….ఎంసిఎ రావడంతో మన కళాశాలలో ఎంబిఎ సీట్ల పరిస్థితి ఏమిటి ?
చైర్మ న్ ..ఎంబిఎ కూడా స్పందన అదికంగా ఉంది..మనకళాశాలలో మనం చేసే స్టాండర్ట్స్ మనకు శ్రీరామరక్ష..ఏ కోర్సు ప్రవేశపెట్టినా ఏ ఐసిటిసి నిభందనలు పాటిస్తాం..ఎంబిఎలో రెండురకాల కోర్సులకు ఏఐసిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఎంబిఎ సాధారణ కోర్సుకు 120 సీట్లు, పైనాన్స్ కు 120 సీట్లు, మంజూరు చేసింది..ప్రస్తుతం మన కళాశాలలో 360 పిజి సీట్లు ఈరెండింటిలో ఉన్నాయి..