!!వైకాపా – టి.డి.పి. నేతలు పందెం మే సవాల్.. 7 అసెంబ్లీలలో పందెం అంటే పందెం!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔ఎగ్జిట్ పోల్స్ కోసం జూన్ 1 వరకు ఎదురుచుపు

⇔రూ. 100కోట్లకు పైగా బెట్టింగులు

పెట్టుబడులు లేకుండా తొడకొడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు… లక్షలు… కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి తొడలు కొడితే ఒకరికి అయితే ప్రమాదం కదా ? అని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎందుకు తొడలు కొడుతున్నారా.. అనే సందేహం ఎవరికైన రావచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజేత పై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు మా పార్టిదే మా నాయకునిదే విజయం… చేతనైతే మేము చెప్పింది కాదంటే ఎన్ని లక్షలు అయిన ఎన్ని కొట్లు అయిన పందెం కాయడానికి మేము సిద్ధం… మీరు సిద్ధమేన అంటు తొడలు వైకాపా, టి.డి.పి. నాయకులు సవాలు విసురుతున్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ పోలింగ్ ముగిసిన వెంటనే బూతుల వారిగా పోలైన ఒట్ల నివేదికను తెప్పించుకొని ఈతొడలు కొట్టడం ఆరంభించారు. ఇప్పటికే రూ.50 నుంచి 100 కొట్ల మద్యన పందాలు జరిగినట్లు అనధికారిక అంచనా. నంద్యాల పార్లమెంటుకు టి.డి.పి. అభ్యర్థిగా బైరెడ్డి శబరి వైకాపా అభ్యర్థిగా పోచా బ్రహ్మనందరెడ్డి పోటి చేస్తున్నారు. ఆళ్ళగడ్డలో మాజీమంత్రి అఖిలప్రియ(టిడిపి), బిజేంద్రనాధ్ రెడ్డి (వైకాపా) ,బనగానపల్లెలో  కాటసాని రామిరెడ్డి, బి.సి. జనార్థనరెడ్డి, నంద్యాలలో యన్.యమ్.డి ఫరూక్, శిల్పారవి, శ్రీశైలంలో బడ్డారాజాశేఖర్రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు ,డోన్లో కోట్ల స్యూర్యప్రకాశ్ రెడ్డి, రాజేంద్రనాదరెడ్డి, నందికోట్కూరులో డాక్టర్ సుధీర్, గిత్తా జయసూర్య, పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరుచరితలు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అన్ని చోట్ల తమ అభ్యర్థి గెలుస్తాడని ప్రత్యర్థులతో పందాలు కాయడం చర్చనియాశంగా మారింది. ఇంతటితో వదలకుండా రాయలసీమలో ఇన్ని సీట్లు తమ పార్టీకి వస్తాయని ఒక పందెం, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో వస్తుందని… రాదని కోట్లలో పందాలు సాగుతున్నాయి. విజేతలు జూన్ 1వ తేదిన ఎగ్జిట్ పోల్స్ వస్తాయని ఆరోజునుంచి పందాలు మరింత పెరిగే అవకాశం ఉందని చర్చలు సాగుతున్నాయి. జూన్ 4వ తేదిన పలితాలు తెలిసిపోతాయి. అప్పటివరకు ఇదే విధంగా తొడలు కొడతారని చర్చ సాగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *