!! షోపుటప్ నేతల హడావిడి !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔అయోమయంలో బలమైన నాయకులు

⇔షోపుటప్ నేతలతో విసిగి వేసారుతున్న బలమైన వర్గ నాయకులు

⇔దండలు, తప్పెట్లు,కేకులతో విసురుతూ గాలాలు 

⇔కాదనలేక….అవును అనలేక…అభ్యర్ధుల పరిస్థితి

నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్ధుల వెంట షో పుట్ అప్ నేతల హడావిడి అధికమయింది..దీనితో రియల్ గా ఓటర్లలో బలం ఉన్న నేతలు అయోమయానికి గురి అవుతుున్నారు..నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని నంద్యాల ప్రధాన కేంద్రంలో ఈ పరిస్థితి వైయస్ ఆర్ సిపి,టిడిపి అభ్యర్దుల వెంట అత్యదికంగా కొనసాగుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..నంద్యాలతోపాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె,డోన్.పాణ్యం,నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాలలో కూడా ఈ షో పుటప్ నేతల హడావిడి కొనసాగుతుండటంతో ఓటర్లలో బలమున్న నేతలు అయోమయానికి గురవుతున్నారు..పది ఓట్లు తాము చెబితే వేసేవాళ్లు లేకపోయినా వీరు మాత్రం నాయకుల దగ్గరకు వెళ్లి గజమాలలు తప్పెట్లతో హడావిడిచేస్తూ కేకులు కట్ చేసి అన్నా జిందాబాద్ ..అన్నా ..గెలుపు తద్యం అంటూ కేకలు వేస్తూ స్వంతంగా సోషయల్ మీడియాలో కవర్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు..వీరిపరిస్థితి ఇలా ఉంటే మరికొందరు అయితే ఈ పనిచేయకుండా అభ్యర్ధి ప్రచారానికి వెలుతుంటే ఆకారులో కూర్చోడానికి ఇష్టపడుతున్నారు.దీంతో తమ ప్రాంతానికి వస్తున్నాడనే సంతోషంతో ఆహ్వానికి వస్తున్నవారు ఆటోలోనో,మోటారుసైకిలుపైనో తమ ప్రాంతానికి తీసుకువెళ్లడమే కాకుండా వారి వెంట వచ్చిన భజన బృందానికి కూడా ఘన స్వాగతం పలుకుతూ అభ్యర్ధికి ఏ విదంగా గౌరవం ఇస్తారో అంతకంటే అదికంగా వీరిని గౌరివించాల్సిన పరిస్తితి ఏర్పడింది..అలా గౌరవించకుంటే అబ్యర్ధిని స్వాగతం పలికిన నాయకులకు ఇక్కడ ప్రజల్లో బలం లేదని పితూరులు చెబుతూ చెడ్డ చేస్తారనే భయం వెంటాడుతున్నది..అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా అభ్యర్ధి కంటే భజనచేసేవారికే అత్యదికంగా గౌరవం ఇవ్వాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు..అభ్యర్ధులు కూడా భజన చేసే వారిని లైక్ చేస్తున్నారని వాస్తవాలు చెప్పే వారిని దూరం ఉంచుతున్నారని అందుకే వారు ప్రమాదపు అంచులోకి వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు…మొత్తం మీద రాజకీయం ఉన్నంతకాలం వీరిని దూరంగా ఉంచడం అసాద్యమనే నిర్ణయానికి బలమున్న నాయకులు రావడంతో వారి హవా కొనసాగుతున్నది…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *