♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
⇔నేడు కర్నూలులో నామినేషన్ దాఖలుచేయనున్న కాటసాని
⇔స్వచ్చందంగా తరలివస్తే సరి ..లేకుంటే వద్దు
⇔ఎన్నికలనిబందనలను పాటించాలని ఆదేశం
ఏడోసారి ఆశీర్వదించాలని కోరుతూ పాణ్యం ఎంఎల్ఎ,వైయస్ ఆర్ సిపి అభ్యర్ధి కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వచ్చందంగా తరలివచ్చిన జనసందోహం మద్య నామినేషన్ వేయడానికి నిర్ణయించుకున్నారు..22 వతేది సోమవారం మద్యాహ్నం 11 గంటల తరువాత తన నామినేషన్ ను కర్నూలు పట్టణంలోని జాయింట్ కలెక్టరు నాగమౌర్య కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందించాలని నిర్ణయించారు..పాణ్యం అసెంబ్లీ ఏర్పాటు అయినప్పటినుండి ఇప్పటివరకు ఏడు సార్లు గెలిచిన ఘనత రాంభూపాల్ రెడ్డికే దక్కింది..మొత్తం 8 సార్లు పోటీచేసి 2 సార్లు ఓటమి చవిచూశారు..1985లో మొదటిసారి పోటీచేసి నాలుగు వేల మెజారిటీతో ఆరంభించి 2019లో 43 వేల మెజారిటీ తో విజయం సాదించి ఉమ్మడి జల్లాలోనే అత్యదిక మెజారిటీ సాధించిన ఘనతను సంపాదించుకున్నారు..1999లో 2014లో ఓటమి చవిచూసిన రాంభూపాల్ రెడ్డి 1989,1994,2004 ,2009 ,2019 లో విజయం సాదించారు..ఈసారి 3లక్షల 22 వేల మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు..ఆయనకు ప్రత్యర్ధిగా గౌరు చరిత తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేస్తూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు..ఎన్నికల సంఘం నిబందనల మేరకు స్వంత వాహానాలు కాని ఇతర వసతులను నామినేషనుకు హాజరయ్యే వారికి కల్పించలేదు..స్వచ్చందగా ఎంతమంది తరలివస్తే వారి సమక్షంలోనే నామినేషను దాఖలు చేసే యోచనలో ఉన్నారు…