!!నామినేటెడ్ నేతలకు అగ్నిాపరీక్ష!!

♦జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔అగ్నిపరీక్ష

ప్రజాబలం లేకున్నా పదవులు పొందిన అధికార వైఎస్ఆర్సిపి నాయకులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష గా మారాయి. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తన 58 నెలల పాలనలో sc,st మైనార్టీ నాయకులకు పెద్ద ఎత్తున నామినేట్ పోస్టులు ఇచ్చారు. అలాగే ఓసి జనరల్ కోటాలో కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తూ తమ పార్టీకి ఓట్లు వేయించే వారికి అధికంగా పదవులు కట్టబెట్టారు .ఇదే సామాజిక వర్గాల్లో పదవులు రాక అన్యాయానికి గురైన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నియోజకవర్గం అంతా కాకపోయినా తాను నివసించే వార్డులో గానీ తాను ఓటు వేసే పోలింగ్ కేంద్రంలో కానీ ఎన్ని ఓట్లు వస్తాయా అని స్వపక్షపార్టీకి చెందిన  ప్రత్యర్ధులు ఎదురుచూస్తున్నారు .ఎమ్మెల్సీ, రాజ్యసభ ,మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాటిలో పదవులు పొందిన వారందరూ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఓటర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం వస్తే తిరిగి నామినేటెడ్ పదవి పొందాలని వీరు చూస్తుండగా వీరిప్రత్యర్ధులు మాత్రం తమకే పదవి వచ్చే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *