!! గోపీ..నీ పయనం ఎటు ?

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

వైసిపి  అంటే ప్రాణం..దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం..గత ఎన్నికలలో ఆయన కుమారుడు జగన్ మోహనరెడ్డి పై కూడా ఇంతకు తగ్గకుండా అభిమానంచూపి తన ప్రసంగాలతో ఓటర్లను ఉత్తేజితులను చేసి ఏకపక్షంగా వైసిపికి ఓట్లు వేయించిన గోపిరెడ్డి గోపీనాధరెడ్డి ప్రస్తుతం సందిగ్దంలో పడ్డారు..గత రెండు దఫాలుగా ఆయన వైసిపి గెలుపుకు కృషిచేసినా ఎన్నికల సమయంలో ఆయనను గౌరవించడం తప్పితే ఆతరువాత ఆయనకు ఎలాంటి పార్టీ భాద్యతలు గాని నామినేటెడ్ పోస్టులలో నియామకం గాని జరగక పోవడంతో ఈపార్టీలో కొనసాగాలా..వద్దా..అనే సందిగ్దంలో కొనసాగుతున్నారు..నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపినాదరెెడ్డిని ఇప్పటికే వైసిపి అభ్యర్ధి శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి మాజీమంత్రి శిల్పా మోహనరెడ్డిలు కలిసి తన మద్దతును కోరారు..అలాగే టిడపి తరుపున కూడా మొదటి సారి మద్దతు కావాలని ఇటీవలనే పార్టీలో చేరిన నరహరి విశ్వనాదరెడ్డి ద్వారా బైరెడ్డి శబరి, నంద్యాల మైనారిటీ టిడిపి అబ్యర్ధి మాజీమంత్రి పరూఖ్ లు కలిసి మద్దతునుకోరారు..దీనితో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి గోెపికి ఏర్పడింది..వారందరికి వారంరోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని వివరించినట్లు సమాచారం..ఈగడువు కూడా ముగియడంతో మరింత గడువును కోరడమా లేక ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే అక్కడికి మరో పార్టీ నాయకులు తన దగ్గరకు రాకుండా ఉంటారని గోపి భావిస్తున్నారు..ఇలాంటి పరిస్థితులలో ఒక్క గోపీనాదరెడ్డే కాకుండా మరికొంతమంది తేల్చుకోలేని పరిస్తితులలోొ ఉన్నారని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *