!!16 మండలాలలో నీటి ఎద్దడిని పరిష్కరిస్తాం..కలెక్టరు!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి

⇔పాత్రికేయల ఇళ్ల స్థలాలపై ఈసి అనుమతికి ప్రయత్నం

⇔పాత్రికేయులకు పోస్టల్ బ్యాలెట్లు

⇔17 మంది వాలంటీర్లు విదులకు దూరంగా ఉంచాం

 

నంద్యాలజిల్లాలో16 మండలాలలో నీటి ఎద్దడి ఉందని సమస్యను పరిష్కరించడానికి ఎన్నికల నిబందనలు అడ్డు రావని జిల్లా కలెక్టరు డా శ్రీనివాసులు తెలిపారు..గతరెండు రోజులుగా  అదికారులతో,విలేకరులతో జాయింట్ కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డితోె కలిసి కలెక్టరు మాట్లాడారు..ఈసమావేశంలో డి ఆర్ ఓ పద్మజ,డిపిఆర్ ఓ మల్లిఖార్జునయ్య, ఇతర అదికారులు పాల్గొన్నారు..

ముఖ్యాంశాలివి

1.ఎన్నికల సందర్బంగా కొత్త పనులు ఆరంభించడం జరగదని పూర్తికాని పనులు పూర్తిచేయవచ్చని తెలిపారు..కేంద్రప్రభుత్వం అమలుచేసే ఎన్ ఆర్ జి యస్ పనులు కొత్తగా చేపట్టాలంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, కొత్త ఉపాది కూలీలను కూడా తీసుకోవడం కష్టంఅవుతుందని వీరికి కూడా ఎన్నికల సంఘం అనుమతి అవసరం.

2.పాత్రికేయలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరగా ఈసి అనుమతికి ప్రయత్నం చేస్తామని ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి తమపరిదిలో లేదు

3.పాత్రికేయులు పోలింగురోజు ఈసి అనుమతితోనే కేంద్రాల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని వారికి పోస్టల్ బ్యాలట్ వసతిని కల్పిస్తాం

4.ఈసి నిబందనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లను 17 మందినిసస్పెండు చేశామని మరికొందరిపై పిర్యాదులు ఉన్నాయని విచారణ జరుపుతాం

5.పత్రికలు మరియు ఎలక్ట్రానికి్ మీడియా,సోషల్ మీడియా ప్రకటనలను ఇవ్వాలనుకుంటే ఈసి అనుమతి తీసుకోవాలని వార్తల విషయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటే వాటిని పెయిడ్ న్యూస్ గా పరిగణిస్తాం

6.పాత్రికేయులకు గాని ప్రజలకుగాని ఎన్నికలకు సంబందించి ఎలాంటి సమాచారం కావాలన్నా నంద్యాలపట్టణంలోని జిల్లా కలెక్టరు కార్యాలయం ఆవరణలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేశామని ఇంకా అదనపు సమాచారం కావాలంటే ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నాం

7. ప్రజలు లేదా ప్రజాప్రతినిదులు ఎన్నికల సంఘానికి పిర్యాదుచేయాలంటే సి విజిల్ యాప్ ద్వారా పిర్యాదు చేస్తే విచారిస్తాం..

8.రాజకీయపార్టీలు సువిద పోర్టల్ ద్వారా అనుమతులకోసం దరఖాస్తుచేసుకుంటే 24 గంటలలోపే అనుమతులు ఇస్తున్నాం.

9. పారదర్శకంగానే ఎన్నికలను నిర్వహిస్తాం..పాత్రికేయులు రాజకీయపార్టీల నాయకులు అనుచరులు సహకారించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *