♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔అనుమతులు తప్పనిసరి
⇔నియోజకవర్గాల వారిగా నిఘా బృందాలు
⇔గల్లీనుంచి గమనించాల్సిందే
సార్వత్రిక ఎన్నికల సందర్బంగా నంద్యాల జిల్లాలో వైసిపి అధినేత జగన్ మోహనరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడల ఆద్వర్యంలో జరిగే బహిరంగ సభలతో పాటు కార్యకర్తల సభలపై ఎన్నికల అధికారులు డేగ కన్ను వేశారు..కోడు ఎక్కడ ఉల్లంఘించినా కేసులుపెట్టడానికి సిద్దం అవుతున్నారు..ఈనెల 27 న ఆళ్లగడ్డలో 28న నంద్యాలలో జరిగే జగన్ సిద్దం సభలతో పాటు ఆ తరువాత జరిగే చంద్రబాబు నందికొట్కూరు,శ్రీశైలం,కర్నూలు సభలు జరిగే అవకాశం ఉండటంతో రెండింటిపై డేగ కన్ను వేసి ఎక్కడ ఉల్లంఘన జరిగితే కొరడా ఝళింపించడానికి జిల్లా కలెక్టరు డా శ్రీనివాసులు, జాయింట్ కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డిల ఆద్వర్యంలో రెవెన్యూ సిబ్బంది సిద్దమయ్యారు..ఇప్పటికే ఎక్కడా కోడ్ ఉల్లంఘించవద్దని ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నదని ప్రత్యర్ధులు గాని,సాదారణ పౌరులు గాని పిర్యాదులకు సిద్దమయ్యారని అదికారులు ఆళ్లగడ్డ వైసిపి అబ్యర్ధి బిజేంద్రనాధ్ రెడ్డికి నంద్యాల వైసిపి అభ్యర్ధి శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డికి పార్లమెంటు అభ్యర్ధులు పోచా బ్రహ్మానందరెడ్డి, బైరెడ్డి శబరిలకు పోన్ చేసి,స్వయంగా వెళ్లి కిందిస్థాయి అదికారులు వివరించినట్లు సమాచారం..ప్రతి విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చి కార్యక్రమాలు జరుపుకోవాలని దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు వివరిస్తున్నారు..ఈరోజునుంచి పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రచారాలకు అయినా సిద్దంగా ఉండాలని కూడా బుదవారం జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో వివరిాంచారు..మంగళవారం కూడా పాత్రికేయులకు ఎంసిఎంసి సభ్యులు ప్రభాకర్ చౌదరి జనార్ధనరెడ్డిలతోపాటుగా పాత్రికేయులను ఆహ్వానించి కోడ్ ఉల్లంఘనకు వీలులేకుండా వార్తలు ప్రచురించాలని కోరారు..లేని పక్షంలో ఎన్నికల సంఘం నియమనిబందనావళి అమలుచేయాల్సి ఉంటుందని కలెక్టరు శ్రీనివాసులు జాయింట్ కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డి వివరించారు..ప్రతిది గమనించి పిర్యాదు చేయాలని డి ఆర్ ఓ పద్మజ డిపి ఆర్ ఓ మల్లిఖార్జునయ్య ఎంసి ఎంసి నోడల్ అదికారి కన్నా తోపాటు ఇతర అదికారులను ఆదేశించారు..నియోజకవర్గ స్థాయి ఆర్ ఓల ఆద్వర్యంలో ఎన్నికల నియమావళిని అమలుచేయడానికి ప్రత్యేక అదికారుల బృందాన్ని నియమించి ఏ స్థాయి నాయకుడిని అయినా ఎన్నికల ఉల్లంఘన జరగకుండా చూడాలని లేని పక్షంలో కలెక్టరు జెసి ల దృష్టికి తేవాలని లేని పక్షంలో సంబందిత అదికారులకు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు..