!!శబరికే టిడిపి జై!!

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

ఎట్టకేలకు నంద్యాల పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా డా బైరెడ్డి శబరి ని పార్టీ అదికారికంగా ప్రకటించింది..నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో బలమైన అభ్యర్థులు ప్రయత్నం చేశారు..వీరిలో శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల ఎంపి ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి, కెవిసుబ్బారెడ్డి.తోపాటు మరికొంతమంది మైనారిటీ నాయకులుె ముమ్మరంగా ప్రయత్నంచేశారు..ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పది సంస్థలతోపైగా సర్వే చేయించి చివరికి అత్యదికంగా శబరికి మద్తతు లభించిందని చెబుతూ శబరిని అదికారికంగా ప్రకటించారు..శబరి నాకే టికెట్టు అని భావించి రెండురోజుల క్రితం స్వగ్రామమైన ముచ్చుమర్రిలో పూజలు చేయించి ప్రచారాన్ని ఆరంబించారు..రెండురోజులలో మంగళగిరికి వెళ్లి పార్టీ అదినేతలు నారాచంద్రబాబు నాయుడు , లోకేష్ ఆశీస్సులు పొంది నంద్యాలలో పార్లమెంటు కార్యాలయాన్ని ఆరంభించి ఎన్నికల ప్రచార బరిలోకి దిగే యోచనలో ఉన్నారు..ఆమె బయోడాటా వివరాలివి…

Dr. బైరెడ్డి శబరి
MBBS/ MD
వయస్సు. 39 సంవత్సరాలు
భర్త. Dr. P.శివచరణ్ రెడ్డి
నెల్లూరు
సర్జికల్, గ్యాస్టో ఎంట్రాలాజిస్ట్
యశోద ఆసుపత్రి, గచ్చిబౌలి, హైదరాబాద్
తండ్రి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే,
సీనియర్ రాజకీయ నాయకులు, రాయలసీమ ఉద్యమనేత
తల్లి. బైరెడ్డి భారతి

రాజకీయ వారసత్వం
నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీగా 1978, 1983, 1989, మూడు సార్లు ఎమ్మెల్యే గా, ఒక సారి ఎమ్మెల్సీగా, 1983లో ఇండిపెండెంట్ ( స్వతంత్ర)అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చరిత్ర సృష్టించిన , మాజీ మంత్రిగా పనిచేసిన బైరెడ్డి శేషశయనారెడ్డి మనుమరాలే బైరెడ్డి శబరి,

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1962 నుంచి 1970 వరకు అసెంబ్లీ స్వీకర్ గా , ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన బనగానపల్లె అప్పటి ఎమ్మెల్యే బి. వి. సుబ్భారెడ్డి కుమారుడు 1983 లో అప్పటి ఎమ్మెల్యే బి. నరసింహరెడ్డి కుమార్తె బైరెడ్డి భారతి కూతురే బైరెడ్డి శబరి

తల్లి బైరెడ్డి భారతీ ఎంఎస్ సి ఫుడ్ టెక్నాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు, MBA చేసి రెండు పీజీ పట్టాలు అందుకొని పట్టభద్రులుగా నిలిచారు.

తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు అసెంబ్లీకి 1994, 1999 రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆనాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి నేటికీ గ్రామాల్లో కనపడుతున్నాయి, అలాగే రాయలసీమ యాత్ సర్వీస్ సోసైటీ, రాయలసీమ పరిరక్షణ సమితి, రాయలసీమ స్టీరింగ్ కమిటీ స్థాపించి రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాయలసీమలోని 8 జిల్లాల్లో రాజీలేని ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసి రాయలసీమ లోని కరువు, వలసలు, నిరుద్యోగ, వెనుకబాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి రాయలసీమ ఉద్యమబిడ్డగా నిలిచారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు గా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పనిచేసారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి NT రామారావుకు రాయలసీమలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమైన యువ నాయకుడు, NTR కు బైరెడ్డి వీరాభిమానిగానే కొనసాగుతున్నారు.

బైరెడ్డి శబరి సేవా కార్యక్రమాలు

కర్నూలు, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చెంచు, దళిత కాలనీలలో ఉచిత మెగా వైధ్య శిభిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించి, ఉచితంగా మందులు అందిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేస్తూ నంద్యాల జిల్లా BJP అధ్యక్షురాలుగా పనిచేసారు. ఇటీవల బీజేపీ కి రాజీనామా చేసి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో Dr. బైరెడ్డి శబరి, ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

Dr. బైరెడ్డి శబరి సేవా కార్యక్రమాలు, ఆమె రాజకీయ కుటుంబ నేపధ్యాన్ని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *