!!నా విక్ట‌రి గ్యారెంటీ అంటున్న శ‌బ‌రి!!

♦జ‌నాస్త్రంతో శ‌బ‌రి ఇంట‌ర్యూ

నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని రైతులు, ప్ర‌జ‌లు, కార్మికులు ఎద్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించ‌డానికి త‌న గెలుపు దోహ‌దప‌డుతుంద‌ని తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి బైరెడ్డి శ‌బ‌రి అన్నారు. బుధ‌వారం జ‌నాస్త్రంతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్ర‌స్తుత ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌లమ‌య్యార‌ని ఆ స‌మ‌స్య‌లంనిటిని తాను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి వైసిపి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు నంద్యాల, ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీ‌శైలం, డోన్, పాణ్యం, నందికొట్కూర్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లిసి వివ‌రిస్తానన్నారు.

జ‌నాస్త్రం : ఏ అంశాల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు
శ‌బ‌రి: ముఖ్యంగా వ్య‌వ‌సాయ ప్రాంతం నంద్యాల అందువ‌ల్ల రైతుల‌కు అవ‌స‌ర‌మైనా నీటి స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను తీసుకుంటా మెట్ట ప్రాంత ప్ర‌జ‌లు ఎన్నొ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన పంట‌లే వేసుకుంటూ స‌రైనా గిట్టుబాటు ధ‌ర లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అవ‌కాశం ఉంటే అక్క‌డ నీటి స‌దుపాయం క‌ల్పించ‌డం పై దృష్టిని సారిస్తా.

జ‌నాస్త్రం: నీ తండ్రి స‌హాయ, స‌హాకార‌లు ఎంత వ‌ర‌కు
శ‌బ‌రి: తండ్రి బైరెడ్డి ఆశీస్సులు, భ‌ర్త శివ‌చ‌ర‌ణ్ రెడ్డి స‌హాకారంతోనే ఎన్నిక‌ల బ‌రీలో దిగా. నంద్యాల పార్ల‌మెంట్ పై తండ్రికి సంపూర్ణ అవ‌గ‌హ‌న ఉంది. ఇక్క‌డి రైతుల కోసం సిద్దేశ్వరంతో పాటు అనేక సాగు నీటి ప్రాజెక్టుల కోసం పోరటాలు జ‌రిపారు. ఆ పోర‌టాలే ఇప్పుడు నాకు ఓట్ల వ‌ర్షం కురిపిస్తాయి. తెలుగుదేశం బిజేపి, జ‌న‌సేన పార్టీల కార్య‌క‌ర్త‌లు నా గెలుపులో కీల‌క పాత్ర పోషించ‌బోతున్నారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల టిడిపి అభ్య‌ర్థులు త‌న‌కు ఒక ఓటు, నాకు ఒక ఓటు వెయ‌మ‌ని చెబుతున్నారు.

జ‌నాస్త్రం: సిద్దేశ్వ‌రంలోని తీగ‌ల వంతెన హాట్ టాపిక్ క‌దా
శ‌బ‌రి: అవును. ఇప్పుడు నేను బిజేపి పొత్తు పార్టీతో పోటీ చేస్తున్న ఈ విష‌యాన్ని మా పార్టీ అధినేత‌ల ద్వారా బిజేపి జాతీయ నాయ‌కుల దృష్టికి తెస్తా. గెలుపొందిన త‌రువాత రైతుల‌కు అనూకులంగా చేయాల‌ని వ‌త్తిడి తెస్తా.

జ‌నాస్త్రం: సేవ కార్యక్ర‌మాలు ఉంటాయ
శ‌బ‌రి: ఖ‌చ్చితంగా పార్ల‌మెంట్ ప‌రిధిలోని పేద మ‌హిళ రోగుల‌కు కార్పొరేట్ వైద్యం అందే విధంగా ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హిస్తాం. హైద‌ర‌బాద్‌లో ఏ స్థాయిలో వైద్యం అందుతుందో అదే స్థాయిలో నంద్యాల ప్ర‌ధాన కేంద్రంలో అందే విధంగా చూస్తా.

జ‌నాస్త్రం: కుటుంబ నేప‌థ్యం
శ‌బ‌రి: నా పేరు డా.బైరెడ్డి శ‌బ‌రి
తండ్రి పేరు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే, ఉద్య‌మా నేత)
భ‌ర్త: డా.పి.శివ చ‌ర‌ణ్ రెడ్డి, నెల్లూరు
వృత్తి: హైద‌ర‌బాద్‌లోని య‌శోద ఆసుప‌త్రిలో స‌ర్జిక‌ల్ గ్యాస్టో ఎంట్రలాజీస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *