♦జనాన్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔60 రోజులు కుటుంబం మొత్తం ప్రచార బాటనే
⇔రాష్ట్రంలోనే ముందుగా కుటుంబం రంగంలోకి
⇔మండుటెండలనూ సైతం లెక్క చేయకుండా
పాణ్యం శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని టచ్ చేయాలంటేనే వణుకు పుట్టే విధంగా కుటుంబ సభ్యులు చేస్తారు. అందుకు ఉదహరణ రెండు రోజుల క్రితం మరోసారి కాటసానినే పాణ్యం నుంచి వైసిపి తరఫున పోటీ చేస్తాడని ప్రకటించిన వెంటనే కుటుంబ సభ్యులందరూ మండుటెండలనూ సైతం లెక్క చేయకుండా ప్రచార బరీలోకి దిగారు. ప్రత్యర్థుల కంటే తామే ముందు ఓటు అడిగి వారి మనస్సును దొచుకునే విధంగా కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ఉమమహేశ్వరమ్మ, తనయుడు శివనరసింహా రెడ్డి, కూతురు కుడా రోజుకు 12 గంటల పాటు ప్రచారం చేసే విధంగా గ్రామాల వారిగా రంగంలోకి దిగారు. ఒక్కొకరి వెంట గ్రామం నుంచి వంద మంది వైయస్ఆర్సిపి కార్యకర్తలు రహాదారిలో ర్యాలీ చేస్తూ ఇళ్లకు వెళ్లి ఓటును అడిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొన్ని గ్రామాల్లో తప్పెట్లతో , మోటర్ సైకిళ్ల ర్యాలీలతో కుడా స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా మారారు. 60రోజులపాటు గ్రామాల్లో పర్యటిస్తూ జగనన్నను సీఎంను చేద్దాం ….. భూపాలన్నాను ఏడవ సారి గెలిపించి రికార్డును సృష్టిద్దాం… గత మెజార్టీని ఈసారి మించుదాం అంటూ నినాధాలు చేస్తూ పండుగ వాతవారణంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంత ముందస్తుగా పాణ్యం అసెంబ్లీలోని కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల్లో కుటుంబ సభ్యులతో ప్రచారం నిర్వహించడం రాష్ట్రంలోనే కాటసాని కుటుంబానికి దక్కిందని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.
పార్టీ టిక్కెట్‌కు పనితీరే ప్లస్
పాణ్యం నియోజకవర్గం నుంచి వైయస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికి పనితీరు ప్లస్ అయ్యింది. ఆరు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొంది. ఏడవ సారి విజయం సాధించడానికి మరో అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరగా నీకు ఎందుకు డౌట్ వచ్చిందన్నా అని జగన్ ప్రశ్నించిన్నట్లు సమాచారం. నీవు పదోన్నతి పై పార్లమెంట్‌కు అభ్యర్థిగా వెళ్తే బాగుంటుంది కదా అని జగన్ సూచించగా నా కుమారుడికి పాణ్యం టిక్కెట్ ఇస్తే నేను రెడి అన్నట్లు తెలుస్తొంది. 2029 ఈ ప్రతిపాధనను పరిశీలిద్దాం ఇప్పటికి నువ్వే అని జగన్, కాటసానితో అన్నట్లు సమాచారం. మొత్తం మీద ఈసారి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నే ప్రకటించడం జరిగింది.