♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔నా ఆశంతా కూతురే… -మంచు మనోజ్
⇔నంద్యాలలో మంచు మనోజ్ హల్చల్
⇔రామకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో భూమా మౌనికకు శ్రీమంతం
నా భార్య త్వరలో ప్రసవించబోతుందని కూతురు పుడితే సంతోష పడతానని సీని నటుడు మంచు మనోజ్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణా పిజి సెంటర్లో జరిగిన భేటి బచాఓ – భేటి పడాఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. మహిళలు శక్తి స్వరూలని స్వతంత్రంగా జీవించగలరని సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడంలో వారికి వారే సాటి అని అన్నారు.
కార్యక్రమంలో విద్యా సంస్థల ఛైర్మన్ డా.రామకృష్ణా రెడ్డి, డైరెక్టర్లు హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి, ఐసిడిఎస్ అధికారులు నాగ సువర్చల, డా.ప్రసన్నలత, చంద్రకళ, తిరుపతి రావు తదితరులు పాల్గొని ఆడపిల్లలను చిన్న చూపు చూడడం మంచిది కాదని అన్నారు. అనంతరం మాట్లాడిన మంచు మనోజ్ విద్యార్థులు హుషారుగా ఉన్నారని కేకలు వేస్తున్నారని ఇటువంటి కేకలు రాయలసీమలోనే ఉన్నాయని మరెక్కడ ఇటువంటి కేకలను వినలేమని వారిని హుషారెత్తించారు. ఈ సందర్భంగా నా భార్య, భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డి గర్భవతి అని ఆమె ఆడ పిల్లకు జన్మనివ్వాలని మీ సమక్షంలో కోరుకుంటున్నట్లు తెలిపారు. తమకు భారీగా స్వాగతం పలికిన రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. అనంతరం రామకృష్ణా రెడ్డి ఇంట్లో భూమా మౌనికకు ముత్తైదువుల మధ్య శ్రీమంతం వేడుకలను నిర్వహించారు. మౌనికకు తల్లిదండ్రులు లేకపోవడంతో వారి కుటుంబ శ్రేయోభిలాషి అయిన రామకృష్ణా రెడ్డి, విజయలక్ష్మి, ప్రగతి, హేమంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకను జరపడంతో పలువురు ప్రశంసాల వర్షం కురింపించారు. మొత్తం మీద సందడి వాతావరణంలో ఈ వేడుక జరగడం ఎంతో సంతోషం కలిగిస్తున్నదని రామకృష్ణా రెడ్డి దంపతులకు రుణపడి ఉన్నామని మౌనిక రెడ్డి పాల్గొన్న మహిళలకు తెలిపారు.