!!నాన్నపై…ప్రేమతో!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

⇔అంతాతానై నడిపిస్తూ …..వ్యూహాలుసైతం పిరోజే

నంద్యాల తెలుగుదేశం పార్టీ అబ్యర్థి ,మాజీ మంత్రి ఎన్ ఎండి పరూఖ్ విజయంకోెసం ఆయన తనయుడు గతంలో ఎన్నడూ లేని విదంగా వ్యూహాలను రూపొందిస్తున్నారు..2004 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చివరిసారిగా అసెంబ్లీకి పోటీచేసిన ఫరూఖ్ కుటుంబ సభ్యులను దూరంగా ఉంచి తమ్ముడు ఖుద్దూస్ తోపాటు స్నేహితులను, శ్రేయోభిలాషులతో ఫరూఖ్ స్వయంగా వ్యూహాలు రూపొందించుకుంటూ విజయాలను సాదిస్తూ వచ్చారు..ఈసారి తండ్రిపై ప్రేమతో ఫరూఖ్ తనయుడు ఫిరోజ్ అంతా తానై ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు..తండ్రి పరూఖ్ నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో సమావేశాలు అవుతూ రాష్ట్ర టిడిపి నేతలకు స్థానికంగా జరిగే ప్రచారాన్ని హాజరవుతున్న జనం గురించి వివరించడంతోపాటు టిడిపికి అనుకూలించే అంశాలపై ప్రెస్ మీట్ లను నిర్వహిస్తున్నారు..ఖుద్దూష్ మాత్రం ఇంటింటి ప్రచారాలు,చాయ్ పే చర్చ లను జరుపుతూ జనాన్ని టిడిపి వైపు తిప్పడంలో నిమగ్నమయ్యారు.అంతేకాక అసంతృప్తి చెందుతున్న వైయస్ ఆర్సిపి నాయకులను తమ వైపు తిప్పుకోవడంలో పిరోజ్ విజయం సాదిస్తున్నారు..పరూఖ్ వయస్సు మీద పడటంతో అవసరాన్ని బట్టి రంగంలోకి దింపుతూ మిగిలిన కార్యక్రమాలన్నీ ఫిరోజ్ చూసుకుంటున్నారు..గతంలో ప్రసంగాలు చేయడానికి కష్టంగా ఉన్న ఫిరోజ్ ఇప్పుడుఉరుకులు పరుగులు తీస్తూ ముందుకు సాగడమే కాకుండా ప్రత్యర్ధులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు..ఫిరోజ్ పై వస్తున్న విమర్శలను కూడా పరిశీలిస్తూ వ్యక్తిగత కక్షతో చేసేవాటిని పక్కకు పెడుతూ అవసరం అయిన వాటిని స్వీకరించి తన స్టయిల్ ను మార్చుకుంటున్నట్లు తమ అనుచరులు తెలుపుతున్నారు..ఒక్కమాటలో చెప్పాలంటే సరైన సమయంలో సరైన స్టెప్పు పరూఖ్ వేశారని దీని వెనుక పిరోజ్ వత్తిడి అదికంగా ఉన్నట్లు ఒక సీనియర్ పాత్రికేయుడు జనాస్త్రంతోె అన్నారు..ఈసారి పోటీగా దూరంగా ఉన్న పార్లమెంటుకు పోటీచేసినా రాజకీయ భవిష్యత్తు కష్టంగా ఉండేదని అందువల్ల పిరోజ్ ఈసారి అంతాతానైనడిపిస్తూ …తండ్రిని గెలిపించి చంద్రబాబుకు గిప్టు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *