♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔నరసింహా స్వామి కళ్యాణానికి రా…రండి
⇔22వ తేదిన నంద్యాల గిరినాథ్ సెంటర్లో
⇔ఆ తరువాత అహోబిల బ్రహ్మోత్సవ యాత్ర
భారీ ఎత్తున్న నరసింహా స్వామి భక్తులున్న నంద్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 22వ తేదిన హిందూ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి కళ్యాణ వేడుకలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని గిరినాథ్ సెంటర్లో హిందూ అన్నదాన సత్రం నిర్వహుకుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కళ్యాణం 22వ తేది ఉదయం 10 గంటలకు ఆరంభమై సాయంత్రం 3 గంటలకు ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు. కళ్యాణానికి హాజరైన భక్తులకు ఉచితంగా నరసింహా స్వామి భక్తులకు కంకనము, ఉచిత భోజన వసతిని కల్పిస్తునట్లు తెలిపారు. ఇక్కడి నుంచి అహోబిలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు ఇచ్చిన అన్నదాన సరకులను, నగదును 200 మంది సేవకుల ఆధ్వర్యంలో బయలుదేరుతామని అన్నారు. వివరాలకు 9849232498, 9866058789, 9491437976లను సంప్రదించాలని కోరారు.