♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔ఇక అహోబిలం సందడి 14 నుంచి 26 వరకు
⇔22 నుంచి 26 వరకు కళ్యాణం, రథోత్సవం, గరుడోత్సవం
⇔2 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచన
దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తి వంతమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన అహోబిల క్షేత్రంలో ఈనెల 14వ తేది నుండి 26 తేది వరకు వార్షిక బ్రహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అహోబిల పీఠాధిపతి రంగనాథ యతింధ్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో జరిగే వేడుకలలో చివరి 6 రోజులు నల్లమల్ల అటవీ ప్రాంతం నరసింహా స్వామి నామ స్మరణతో మారుమోగనున్నది. అనేక సంవత్సరాల నుంచి అహోబిల క్షేత్రంలో జరిగే బ్రహ్మాత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించాలని జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ఈసారి పారువేట ఉత్సవాలకు రాష్ట్రప్రభుత్వ గుర్తింపు లభించింది. ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రయత్నానికి మంత్రి రోజ సానూకులంగా స్పందించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ లంఛనాలతో వేడుకలను నిర్వహించనున్నట్లు సేతురామన్ విలేకరులకు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో సాధారణ భక్తులు చేరుకొని నవ నరసింహా క్షేత్రాలను దర్శించుకొని తమమొక్కుబడులను తీర్చుకుంటారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగే వేడుకలను ప్రధాన అర్చకుడు కిడాంబీ వేణుగోపాల్, సేతురామన్ పర్యవేక్షణలో ప్రతి భక్తుడికి అధ్బుతమైన దర్శనం దక్కే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి సలహాలను స్వీకరించడమే కాకుండా, నంద్యాల ఆర్డీఓ, ఆళ్లగడ్డ డిఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పై ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలలో వేరువేరుగా జరిగే వేడుకలను ఆలయ నిర్వహుకులు సేతురామన్ జనాస్త్రంకు తెలిపారు. 22వ తేదిన ఎగువ అహోబిలంలో కళ్యాణం, 24వ తేదిన రథోత్సవం, 25వ తేదిన గరుడోత్సవం, దిగువ అహోబిలంలో 23న కళ్యాణం, 25న రథోత్సవం, 26 గరుడోత్సవం నిర్వహిస్తారని సేతు రామన్ తెలిపారు. ఈ మూడు రోజుల్లో జరిగే ఉత్సవాల్లో కనీసం 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అన్నారు. ప్రతి భక్తుడికి ప్రత్యేక వసతులను కల్పించినట్లు తెలిపారు.