♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔జగజ్జనని అమ్మవారి వేడుకలను చూసొద్దం రండి
⇔జగజ్జనని ప్రతిష్ట ఉత్సవాలు 16 నుంచి
⇔సాంప్రదాయ దుస్తులతోనే అమ్మవారి దర్శనం
⇔ఉచిత పూజలు, భోజనాలు, ఆల్పాహార వసతి
⇔దర్శన టిక్కెట్ నో
⇔దేశం నలుములల నుంచి భక్తులు
ఈనెల 16 నుంచి 20వ తేది వరకు నంద్యాల పట్టణంలోని జగజ్జనని ఆలయంలో పంచదశ ప్రతిష్ట ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకుడు శివనాగ పుల్లయ్య తెలిపారు. శనివారం ఆయన నంద్యాల పట్టణంలో జనాస్త్రంకు ఇంటర్‌వ్యూ ఇచ్చారు.
⇒ప్రపంచంలోనే రెండవ ఆలయంగా గుర్తింపు పొందిన జగజ్జనని ఆలయంలో అమ్మవారి ప్రతిష్ట జరిగి 15 ఏళ్లు అయ్యాయి. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నదనిఅందుకుతగ్గ ఏర్పాట్లను భక్తులే స్వయంగా చేసుకుంటున్నరన్నారు.
⇒నాలుగు రోజుల్లో అమ్మవారిని 40 వేల మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది.
⇒దేశంలోని పది రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కుడా భక్తులు ప్రతిష్ట ఉత్సవాలల్లో పాల్గొంటారన్నారు.
⇒ఆలయంలో జరిగే ఏ పూజకు పైసా కుడా టిక్కెట్ రూపంలో వసూల్ చేయమన్నారు.
⇒ఎంత మంది భక్తులు వచ్చినా వారికి 12 గంటల పాటు ఆల్పాహారం, భోజన వసతిని ఉచితంగా కల్పిస్తామన్నారు.
⇒ఆర్థిక ఆదాయం లేని భక్తుల దగ్గర నుంచి కోట్లకు పడగెత్తిన వారికి కుడా ఒకటే తరహా దర్శనం ఉంది.
⇒సాంప్రదాయ దుస్తులతో వచ్చిన వారికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుందని ఎంతటి శక్తివంతులైనా సాంప్రదాయ దుస్తులు ధరించకుంటే వారికి అమ్మవారి దర్శన భాగ్యం దక్కదన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉచిత సేవలు చేసే మహిళలు కానీ, పురుషులు కానీ, యువతీ, యువకులు కుడా ఆలయంలో సంప్రదించాలని శివనాగ పుల్లయ్య కోరారు.
Jai jagajjannani