!!రంజాన్ వైపు ….. శిల్పా, ఫ‌రూక్‌ల చూపు !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔రంజాన్ వైపు ….. శిల్పా, ఫ‌రూక్‌ల చూపు

⇔ఈనెల 12 నుంచి వ‌చ్చే నెల 10వ తేది వ‌ర‌కు

⇔ఎన్నిక‌లు కావ‌డంతో శిల్పా, ఫ‌రూక్‌లు పోటాపోటి స‌హాయాలు

⇔ఇఫ్తార్ విందుల‌కు ఇరువురుకి కోట్ల‌లో ఖ‌ర్చు

⇔స్వయంగా హాజ‌రై ముస్లీంల మ‌న్న‌న‌లు పొందే య‌త్నం

⇔హైదార‌బాద్, బెంగ‌ళూర్‌, చెన్నైల నుంచి మ‌త పెద్ద‌ల‌ను పిలిచే య‌త్నం

రంజాన్ ప‌ర్వ‌దినాన్ని ముస్లీం మైనార్టీలు అత్యంత ప‌విత్రంగా భావించ‌డ‌మే కాకుండా భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో కొన‌సాగించాల‌ని నంద్యాల అసెంబ్లీ, నియోజ‌క‌ర్గంలోని దాదాపు ల‌క్ష మంది మైనార్టీలు భావిస్తూ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. నంద్యాల ప‌ట్ట‌ణంలోని దాదాపు 80 వేల మంది మైనార్టీలు గోస్పాడు, నంద్యాల మండ‌లాల్లో క‌నీసం 20 వేల మంది వంద‌లాది మ‌సీదుల‌లో ప్రార్థ‌న‌లు జ‌ర‌ప‌డానికి సిద్ధం అవుతున్నారు. వీరిలో పేద‌ ముస్లీం కుటుంబాల‌ను త‌మ వైపు తిప్పుకొని వారి మ‌న్న‌న‌లు పొందే య‌త్నంలో వైసిపి ఇన్‌ఛార్జి ఎమ్మెల్యే ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డి ఆయ‌న తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి, టిడిపి త‌ర‌ఫున మాజీ మంత్రి ఫ‌రూక్ ఆయ‌న తన‌యుడు ఎన్ఎండి ఫిరోజ్ వ్యూహాల‌ను రూపొందిస్తున్నారు.

నంద్యాల ప‌ట్ట‌ణంలో గ‌తంలో ఇరువురు ప్ర‌త్యేకంగా పేద ముస్లీంలకు ఉచితంగా ఆహార వ‌స్తువులు, వ‌స్త్రాలు త‌దిత‌ర వాటిని అందిచే వారు. ఇప్పుడు గ‌తం కంటే అధికంగా ముస్లీం కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల కిట్లు, వ‌స్త్రాల‌ను 90 నుంచి 95 శాతం పంపిణీ చేయాల‌ని నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తొంది.
రంజాన్‌లో 14 గంట‌ల పాటు ఉప‌వాసంను మైనార్టీలు కొన‌సాగిస్తారు. తెల్ల‌వారుజామున 4 గంట‌ల ప్రాంతంలో (స‌హేరి) ఆహారం తీసుకొని ఆ త‌రువాత రాత్రి 6:30 గంట‌ల ప్రాంతంలో (ఇఫ్తార్‌) ఉప‌వాస దీక్ష‌ను విర‌మిస్తారు.రంజాన్ వేడుక‌లు ఈనెల 12 నుంచి వ‌చ్చే నెల 17 తేది వ‌ర‌కు ఉప‌వాస దీక్ష‌ల‌ను కొన‌సాగిస్తారు.

.
ఇఫ్తార్ విందును ఇవ్వడానికి ఎమ్మెల్యే ర‌విచంద్ర కిషోర్ రెడ్డి, టిడిపి నాయ‌కుడు ఫ‌రూక్‌లు కోట్లలో డ‌బ్బును వ్య‌యం చేస్తారు. రంజాన్ ఉప‌వాసాల్లో మైనార్టీలు మార్చి 15, 22, 29, ఏఫ్రిల్ 5వ తేది శుక్ర‌వారాలు వ‌స్తుండ‌డంతో ఆ రోజుల్లో మైనార్టీలు మ‌రింత భ‌క్తితో ఉంటారు. ఈరోజల‌ను కుడా ఎలా ఉప‌యోగించుకోవాలి అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
-ముస్లీంల‌కు ఇచ్చే విందులో గ‌తంలో 2,3 ఐట‌మ్‌ల‌ను ఏర్పాటు చేసే వారు ఇప్పుడు 5, 6 ఐట‌మ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. అత్య‌ధిక విందుల‌కు అగ్ర‌నేత‌లే హాజ‌రై త‌మ‌కు మ‌ద్ద‌త్తు ల‌భించే విధంగా వ్యూహం చేస్తున్నారు.

ఇంత‌టితో తృప్తి చెంద కుండా ముస్లీంల‌ను ఆక‌ట్టుకునే మ‌త పెద్ద‌ల‌ను కుడా హైదార‌బాద్, చెన్నై, బెంగ‌ళూర్‌ల నుంచి ర‌ప్పించి శిల్పా, ఫ‌రూక్‌లు సందేశాలు ఇప్పించే య‌త్నంలో ఉన్నారు. ఎన్నిక‌లు క‌దా మ‌రి వారి మ‌న్న‌న‌ల కోసం పండ‌గ స‌మ‌యంలో మ‌రికొన్ని వ్యూహాలు రావ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *