!!లేచి కుర్చున్న అక్ర‌మాల గ్యాంగ్‌లు వెయ్యికోట్ల స్థలాల అక్ర‌మణ‌ల‌కు య‌త్నాలు!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔లేచి కుర్చున్న అక్ర‌మాల గ్యాంగ్‌లు

⇔రూ.1000 స్థ‌లాల అక్ర‌మణ‌ల‌కు య‌త్నాలు

⇔ఎన్‌జిఓ కాల‌నీ స్థ‌లాల వైపే అక్ర‌మార్కులు చూపు

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో నంద్యాల ప‌ట్ట‌ణంలోని అక్ర‌మాల గ్యాంగ్‌లు బ‌రి తెగించిన‌ట్లు తెలుస్తొంది. నంద్యాల ప‌ట్ట‌ణంతోపాటు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ప్ర‌భుత్వ స్థలాల‌ను కబ్జా చేయ‌డానికి ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కాపాడాల‌ని ఆలోచ‌న‌లో ఉన్న కొంద‌రు అధికార పార్టీ నాయ‌కులు, అధికారులు నిస్సహాయ స్థితిలో ప‌డిపోతుంటే ఇదే అవ‌కాశంగా అధికార పార్టీలోని మ‌రికొంత మంది అక్ర‌మార్కులు కోట్లు రూపాయ‌ల‌ను చేయిచేసుకొనే య‌త్నం లో నిమ‌గ్న‌మైయ్యారు. ఇందుకు త‌మ స‌ర్వ శ‌క్త‌లు వ‌డ్డుతున్నారు. నంద్యాల ప‌ట్ట‌ణంతో పాటు చుట్టుప‌క్క‌ల గ్రామాలైన రైతున‌గ‌ర్, వైయ‌స్ఆర్ న‌గ‌ర్, అయ్యలూరు, వెంక‌టేశ్వ‌ర‌పురం ప్రాంతాల‌లో స‌బ్ రిజిస్ట్రార్ విలువ కంటే మార్కెట్ విలువ ప‌ది నుంచి ఇర‌వై రెట్లు అధికంగా ఉంది. ఈ అవ‌కాశం రావాలంటే మ‌రో ఐదేళ్లు ప‌డుతుంద‌ని కోట్లు విలువ చేసే స్థలాల‌ను త‌మ‌కు అనూకులం చేసుకోవాలంటే భ‌విష్య‌త్తులో ఇబ్బంది అవుతుంద‌ని అందువ‌ల్ల ఏ దారిలో అయితే ప‌ని అవుతుందో అదే దారిలోనే అక్ర‌మార్కులు వెళ్తున్నారు. ఒక నంద్యాల ప‌ట్ట‌ణంలోనే దాదాపు రూ.1000 కోట్లకు పై ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కైవ‌పం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ఆరంభించారు. అధికార పార్టీ నేత‌లైనా ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డిలు అడ్డుకునే య‌త్నం చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీకి చెంద‌న మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, మాజీ మంత్రి ఫ‌రూక్ శ్రేయోభిలాషి అయిన న్యాయ‌వాది తుల‌సి రెడ్డిలు మాత్రం అధికార పార్టీ నేత‌ల అండ‌దండ‌ల‌తోనే అక్రమాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపిస్తున్నారు. అయితే చ‌ట్టంలోని లోసుగుల‌నూ త‌మ వైపు తిప్పుకుని అధికారుల‌కు భారీ ఎత్తున ఆశ చూపి రిజిస్ట్రేష‌న్ య‌త్నాలు సాగుతున్నాయి. నంద్యాల ప‌ట్ట‌ణంలోని ఒక్క ఎన్‌జిఓ కాల‌నీలోనే దాదాపు రూ.500 కోట్లు విలువ చేసే ప్ర‌భుత్వ స్థ‌లాలు ఉంటే వాటిలో క‌నీసం రూ.200 కోట్లు విలువ చేసే స్థ‌లాల‌ను స్వ‌హా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. వారిని అదుపు చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని కొంద‌రు అధికార పార్టీ నాయ‌కులే అంటున్నారు. నంద్యాల‌లో రిజిస్ట్రేష‌న్ అధికారులు అచితుచి రిజిస్ట్రేష‌న్లు చేస్తుంటే అక్ర‌మార్కులు మాత్రం ఎక్కడ అనూకుల‌మైతే అక్క‌డి స‌బ్ రిజిస్టార్ కార్యాల‌యాల‌కు వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటున్నారు. ఇక్క‌డి అధికారుల‌కు క్లిక్ కోట్ట‌మ‌ని వ‌త్తిడి తెస్తున్నారు. మొత్తం మీద అక్ర‌మార్కుల అగ‌డాల‌ను ఉన్న‌త స్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *