♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒వారికేమో మేకలు ఇస్తివి … మాకేమో సన్న బియ్యం నూకలిస్తివి
⇔నిజాయితీ కౌన్సిలర్ల ఆవేదన
⇔వన్ టు వన్ సమావేశం పెడితే చెబుతాం
⇔శిల్పాకు ఆదే పార్టీ కౌన్సిలర్ల మొర
వారికేమో మేకలు ఇస్తివి … మాకేమో సన్న బియ్యం నూకలిస్తివి… మేకలేమో మందలుగా అయ్యే … నూకలేమో కరిగిపోయ్యే అనే పోక్స్ సాంగ్‌ను పాడుకుంటూ నంద్యాల పురపాలక సంఘంలోని కౌన్సిలర్లు తిరుగుతున్నారు. దీని అర్థం ఈ స్టోరీ లోపలోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది.
(జనాస్త్రం ప్రత్యేక కథనం)
ఇళ్ల పట్టాల అక్రమాల పై అధికార పార్టీలో ఆగ్రహా వేశాలు పెల్లుబుక్కుతున్నాయి. ఇటీవల నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ వీధిలో అధికార పార్టీకి చెందిన దాదాపు 5గురు కౌన్సిలర్లు దాదాపు వంద పట్టాలను పేద ప్రజల పేరు మీద తీసుకొని బినామీకి తెర లేపారు. కొన్ని పట్టాలను తమ అనుచరులకు పంపిణీ చేసి మిగిలిన పట్టాలను తమదగ్గరనే ఉంచుకున్నారని ఇవి కొంతవరకు ఉండవచ్చని అంచన. వీటిని విక్రయిస్తే రూ.1.50 నుంచి రూ.2 కోట్ల వరకు లబ్ది జరగవచ్చని అంచన వేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన 37 మంది కౌన్సిలర్లు ఉంటే ఇందులో 25 మందికి పైగా కౌన్సిలర్లకు ఎలాంటి ఆదాయం లేదు. వారు నిజాయితీగానే ఉన్నారు. వీరిలో కొందరు పది లక్షలు ప్రత్యర్థులకు ఇచ్చి రాజీ కాగా మరి కొందరూ రూ.40 నుంచి 50 లక్షలు వ్యయం చేసి విజయం సాధించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై మూడు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు లక్ష రూపాయలు కుడా సంపాధించుకొకపోగా నెలకు రూ.10 వేలు కనీస ఖర్చులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమ నేతలైనా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, రవిచంద్రకిషోర్ రెడ్డికి తెలుసునని అయితే తమకు ఇలాంటి వాటిలో సహాయం చేస్తే తాము లబ్ది పొందకపోయిన తమ వెంట తిరుగుతూ శిల్పా కుటుంబీకుల విజయం కోసం కృషి చేస్తున్న తమ అనుచరులకు మేలు చేసినట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అక్రమార్కులు శిల్పా రవి, మోహన్ రెడ్డి మెతక వైఖరిని, మంచి తననాన్ని అలుసుగా తీసుకొని తమ దందాను కొనసాగిస్తున్నారని అధికార పార్టీకి చెందిన నిజాయితీ కౌన్సిలర్లు చెబుతున్నారు. 2014లో ఇలాంటి వారి వలనే మోహన్ రెడ్డి ఓటమి చవిచూశారని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వారు కలిగిస్తున్న నష్టం అంతా … ఇంతా కాదని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారని, అలాంటి వారికి మచ్చ తెచ్చేవారి పై కఠినంగా వ్యవహరించి శిల్పా విజయమే ఊపిరి శ్వాసగా తిరిగే వారిని 42 వార్డులలో వార్డుకు 20 మంది ఎంపిక చేసి వారికి ఉన్న అర్హతలను బట్టి ఇళ్ల పట్టాలను అందించాలని జనాస్త్రంతో చెబుతున్నారు.